రాజమౌళి క్లారిటీ ఇచ్చేస్తే పోలే!
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29 తర్వాతి షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది.;
దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో, దాన్ని ప్రమోట్ చేయడంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే దానిపై హైప్ పెంచి సినిమాకు కావాల్సినంత అటెన్షన్ ను తీసుకొస్తాడు. రాజమౌళి ఏదైనా సినిమాను మొదలుపెట్టే ముందే ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన విషయాలు, అందులో పనిచేసే నటీనటులు, టెక్నీషియన్లు, ఆ కథా నేపథ్యమేంటి, సినిమా టార్గెట్ ఏంటనేది కూడా ముందే అనౌన్స్ చేస్తాడు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా రాజమౌళి ఇదే చేశాడు.
కానీ ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో చేస్తున్న సినిమా కోసం తన పాత ఫార్ములాని పూర్తిగా వదిలేశాడు. రాజమౌళి ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయలేదు. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29 తర్వాతి షెడ్యూల్ కోసం సిద్ధమవుతుంది.
అసలు మీడియాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాజమౌళి ఇలా సైలెంట్ గా సినిమాను మొదలుపెట్టడమే ఆశ్చర్యంగా ఉంటే రీసెంట్ గా సెట్ నుంచి లీకైన వీడియో చూశాక కూడా రాజమౌళి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దానికి తోడు రిలీజైన వీడియో ఏమైనా మామూలుదా అంటే కాదు. మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు బయటికొచ్చిన వీడియో అది.
అందరి కంటే ఎంతో జాగ్రత్తగా ఉండే రాజమౌళి సెట్స్ నుంచి వీడియో లీకైందంటే లీకుల వ్యవహారం ఎంత ముదిరిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి ఉన్న సమస్యను ముందుగానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకు సంబంధించి రాజమౌళి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ముందుముందు ఈ ప్రాజెక్టుకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ రాజమౌళి ముందే చెప్తాడు కాబట్టి ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదు. మరి రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 కు సంబంధించిన ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడో చూడాలి.