విక్రమ్ వీర ధీర శూర ట్రైలర్ టాక్..!

వీర ధీర శూర ట్రైలర్ చూస్తే విక్రమ్ లోని మాస్ ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టు ఉన్నాడని అనిపిస్తుంది.;

Update: 2025-03-22 13:38 GMT

చియాన్ విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా వీర ధీర శూర. హెచ్.ఆర్ పిక్చర్స్, రియా శిబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వీర ధీర శూర ట్రైలర్ చూస్తే విక్రమ్ లోని మాస్ ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా వాడుకున్నట్టు ఉన్నాడని అనిపిస్తుంది. ఓ పక్క జాతర జరుగుతుంటే కొంతమంది కోసం పోలీసులు వెతుకుంతుంటారు.. ఈలోగా కాళీ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ కాళీ ఎవరు అతను ఏం చేశాడన్నది సినిమా కథ.

ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముందు చెప్పినట్టు విక్రమ్ లోని ఊర మాస్ యాంగిల్ ని డైరెక్ట్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాకు అంతా సెటప్ బాగుంది. ట్రైలర్ కట్ ఆసక్తి కలిగేలా చేశారు. విక్రమ్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాస్ బొమ్మగా వీర ధీర శూర ఉండబోతుందని అనిపిస్తుంది.

సినిమాలో విజువల్స్ కి తగిన బిజిఎం ఇంక విక్రమ్ తో పాటు ఎస్.జె సూర్య నటన అన్నీ కూడా బాగా కుదిరినట్టే అనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ కాళీ ఎవరు ఏం చేస్తాడ్.. పోలీసులతో అతని ఫైట్ ఏంటి.. కాళీ చేసే మాస్ జాతర ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే మార్చి 27 వరకు వెయిట్ చేయాల్సిందే. తన ప్రతి సినిమాతో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని చూసే విక్రమ్ ఇప్పుడు ఒక పక్కా మాస్ సినిమా వీర ధీర శూర తో వస్తున్నాడు.

ఈ సినిమాను ముందు పార్ట్ 2 వదులుతున్నారు అంటేనే సినిమా మీద వీళ్లకున్న నమ్మకం ఎలాంటిదో అర్థమవుతుంది. విక్రం వీర ధీర శూర పార్ట్ 2 ని తెలుగులో ఎన్.వి.ఆర్ సినిమాస్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీకెండ్ లో చాలా సినిమాలు రిలీజ్ ఉండగా రేసులో విక్రం వీర ధీర శూర కూడా మంచి కంటెంట్ తోనే వస్తుందని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

విక్రమ్ వీర ధీర శూర ఈసారి పక్కా ప్లానింగ్ తో వస్తున్నట్టు అర్ధమవుతుంది. తను చేసే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే ప్రయత్న లోపం లేకుండా కష్టపడుతున్న చియాన్ విక్రమ్ కు ఒక సూపర్ హిట్ సినిమాగా వీర ధీర శూర నిలుస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Full View
Tags:    

Similar News