ఎవరి ట్యాగులు వాళ్లు పెట్టేసుకుంటున్నారు..!
ఒక మోస్తారు సినిమాలు చేస్తున్న హీరో కూడా తన పేరు ముందు ట్యాగ్ పెట్టేస్తున్నాడు.;
ఒకప్పుడు హీరో ముందు ట్యాగ్ రావాలంటే చాలా పెద్ద కథ ఉండేది. అసలు హీరోలకు ఈ ట్యాగ్ లు ఫ్యాన్స్ పెడుతుంటారు. ప్రతి హీరోకి ఫ్యాన్స్ అంతా కలిసి పెట్టే పేరుని ఆ హీరో పేరు ముందు ట్యాగ్ అవుతుంది. మనం పిలుచుకునే ఇప్పటి ట్యాగ్ ఉన్న స్టార్స్ అందరికీ అలా ఫ్యాన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ లతోనే అలా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక మోస్తారు సినిమాలు చేస్తున్న హీరో కూడా తన పేరు ముందు ట్యాగ్ పెట్టేస్తున్నాడు.
ఈ విషయాన్ని కొత్త హీరో నార్నే నితిన్ ప్రస్తావించారు. ఎన్టీఆర్ బావమరిదిగా మ్యాడ్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నార్నే నితిన్ ఆ సినిమా హిట్ అవ్వడం ఆ నెక్స్ట్ వచ్చిన ఆయ్ సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నెక్స్ట్ వీక్ మ్యాడ్ స్క్వేర్ తో రాబోతున్నాడు నార్నే నితిన్. మ్యాడ్ స్క్వేర్ లో నార్నే నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా నటించారు.
ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో నార్నే నితిన్ హీరోల ట్యాగ్స్ మీద కామెంట్ చేశాడు. మీరు కూడా పేరు ముందు ట్యాగ్ ట్రై చేయండని అంటే హీరోల ముందు ట్యాగ్ లు ఒకప్పుడు ఫ్యాన్స్ పెట్టేవారు. ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేసిన హీరోలు ఎవరికి వారు పెట్టేసుకుంటున్నారని అన్నాడు. నార్నే నితిన్ ఈ కామెంట్ ఎవరినైనా ఉద్దేశించి అన్నాడా లేదా క్యాజువల్ గా అన్నాడా అన్నది తెలియదు కానీ అసలు అతను అన్నది ఎవరిని అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలైంది.
నార్నే నితిన్ కి మ్యాడ్ స్టార్ ఇవ్వొచ్చా అన్న ప్రశ్నకు ఈ రకంగా అతను స్పందించాడు. ఐతే మరీ ఒకటి రెండు సినిమాలు చేసి ట్యాగ్ పెట్టేసుకుందాం అంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. హీరోగా ఒక స్టాండర్డ్ నెస్ వచ్చిన వాళ్లే ట్యాగ్ ని పెట్టుకుంటారు. మరి నార్నే నితిన్ ఏ ఉద్దేశంతో అన్నా కూడా కచ్చితంగా హీరోల ట్యాగ్ లపై పెను దుమారమే లేపేలా ఉందని చెప్పొచ్చు.
ఇక మ్యాడ్ స్క్వేర్ విషయానికి వస్తే కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. మ్యాడ్ సినిమా టైం లో అసలేమాత్రం అంచనాలు లేవు కానీ మ్యాడ్ స్క్వేర్ మీద యూత్ ఆడియన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి సినిమా రేంజ్ ఏంటన్నది నెక్స్ట్ వీక్ రిలీజ్ అయితే గానీ తెలుస్తుంది.