పాత ట్రెండులో రాజమౌళి హీరోలు

దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో హీరోల హెయిర్ స్టైల్ విషయంలో అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటున్నారు

Update: 2024-04-24 13:19 GMT

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఈ స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు అందరూ వాడుతూనే ఉంటాం. అయితే ఫ్యాషన్ విషయంలో ఈ స్టేట్మెంట్ మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. పాతకాలపు డ్రెస్సింగ్ స్టైల్ ను ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. నగలు విషయంలోనూ అంతే. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతోంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో హీరోల హెయిర్ స్టైల్ విషయంలో అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటున్నారు.

అందుకు కారణం.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్. ఇటీవల ఈ స్టార్ హీరోల లేటెస్ట్ లుక్స్ బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో తమ అభిమాన హీరోల నయా లుక్స్ ను షేర్ చేసి మురిసిపోయారు. అయితే ప్రభాస్, మహేష్ బాబు లుక్స్ లో కామన్ థింగ్ ఏంటంటే.. ఇద్దరూ లాంగ్ హెయిర్ తో కనిపించడం.

ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో అంతా మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు చాలా సినిమాల్లో హీరోలు లాంగ్ హెయిర్ తో కనిపించేవారని, మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో అదే ట్రెండ్ కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటున్నారు. 15 ఏళ్ళ క్రితం స్టార్ హీరోల లుక్స్ గుర్తొస్తున్నాయని చెబుతున్నారు. ఇదే ట్రెండ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని నెలల పాటు కంటిన్యూ అవుతుందని అంటున్నారు.

అయితే గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో తన నెక్స్ట్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవల మహేష్ ఎయిర్ పోర్ట్ నుంచి రావడం, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆయనను కలవడం.. అలా సూపర్ స్టార్ లుక్స్ బయటకొచ్చాయి. లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ కనిపించారు. జక్కన్న మూవీ కోసం సూపర్ స్టార్.. కంప్లీట్ మేకోవర్ అయినట్లు ఈజీగా అర్థమవుతుంది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కల్కి మూవీని పూర్తి చేసిన ఆయన కొన్ని రోజుల క్రితం రాజా సాబ్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ప్రభాస్, నిధి అగర్వాల్ పై ఓ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు సమాచారం. మరి లాంగ్ హెయిర్ తో ప్రభాస్, మహేష్ బాబు.. సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటారో చూడాలి.

Tags:    

Similar News