'అమరన్' డైరెక్టర్ తో ధనుష్? ఇప్పుడే ఎందుకు?

ఈ నేపథ్యంలో అమరన్ డైరెక్టర్ తో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమా చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

Update: 2024-11-06 16:30 GMT

అమరన్.. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దివంగత ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజకుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ముకుంద రాజన్ గా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్ గా సాయి పల్లవి యాక్ట్ చేశారు. ఇద్దరూ సినిమాలో తమ పాత్రల్లో ఒదిగిపోయి అలరించారు. మూవీ విజయానికి మెయిన్ అసెట్స్ గా మారారు.

అక్టోబర్ 31వ తేదీన విడుదలైన అమరన్.. మూవీ రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం ఇండియాలో రీసెంట్ గా రూ.100కోట్ల క్లబ్‌ లో చేరింది. దీంతో సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు, సెలబ్రిటీలు, విమర్శకులు. అదే సమయంలో పెరియస్వామి తెరకెక్కించే విధానం కూడా బాగుందని కొనియాడుతున్నారు.

ఈ నేపథ్యంలో అమరన్ డైరెక్టర్ తో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమా చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అంతా ఓకే అయిందని వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రొడక్షన్ హౌస్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని, అది అయ్యాక సినిమాను ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

దీంతో శివకార్తికేయన్ ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట స్పందిస్తున్నారు. అమరన్ తో తమ అభిమాన హీరో క్రేజ్ బాగా పెరిగిందని చెబుతున్నారు. ఫేమ్ ఒక్కసారిగా ఓ రేంజ్ కు చేరిందని అంటున్నారు. అందుకే ధనుష్.. వెంటనే అమరన్ డైరెక్టర్ ను అప్రోచ్ అయినట్లు ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు శివ కార్తికేయన్ కు పెరిగిన క్రేజ్ చూసి ధనుష్ షాక్ అయినట్లు ఉన్నారని ఆరోపిస్తున్నారు.

అందుకే పెరియస్వామితో వర్క్ చేయాలని ధనుష్ నిర్ణయించుకున్నట్లు ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ సినిమా చేయాలనుకంటే అమరన్ వచ్చాకే ఎందుకని అంటున్నారు. నిజానికి.. శివకార్తికేయన్ ను ఇంట్రడ్యూస్ చేసింది ధనుషే. తన హార్డ్ వర్క్ తో కోలీవుడ్ స్టార్ హీరోగా ఆయన ఎదిగారు. అందుకే అది చూసి ధనుష్ అసూయ పడుతున్నారని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ధనుష్, అమరన్ డైరెక్టర్ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి

Tags:    

Similar News