రాజ్ కుమార్ హిరాని నెక్స్ట్.. ఇప్పట్లో కష్టమే?

బాలీవుడ్ లో బెస్ట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న ఈయన కెరీర్లో ఇప్పటివరకు తీసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Update: 2023-12-28 02:45 GMT

టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఎస్. ఎస్ రాజమౌళి. 'స్టూడెంట్ నెంబర్ వన్' నుంచి 'RRR' వరకు రాజమౌళి తీసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి. సేమ్ ఇలాగే బాలీవుడ్ లోనూ అపజయం ఎరుగని దర్శకుడు ఒకరున్నారు. అతని పేరే రాజ్ కుమార్ హిరాని. ఈయన పేరు తెలుగు వాళ్లకు ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ 3 ఐడియట్స్, Pk మూవీ డైరెక్టర్ అంటే అందరూ గుర్తుపట్టేస్తారు.

బాలీవుడ్ లో బెస్ట్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న ఈయన కెరీర్లో ఇప్పటివరకు తీసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక సింపుల్ కథని తన ఫిలిం మేకింగ్ తో ప్రేక్షకులకు టచ్ అయ్యేలా చెప్పడం రాజ్ కుమార్ హిరాని స్టైల్. ఈయన సినిమాల్లో స్టార్ హీరోలు అవసరం లేదు. ఈయన సినిమా థియేటర్స్లోకి వస్తుందంటే హీరో, హీరోయిన్, ఇతర విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాకు వెళ్లి ఆడియన్స్ చాలామంది ఉన్నారు.

అలాంటి ఈ బెస్ట్ ఫిలిం మేకర్ తన తాజా చిత్రంతో మొదటిసారి ప్లాప్ అందుకున్నాడు. దాంతో ప్రస్తుతం నార్త్ లో దీని గురించే ఒక్క డిస్కషన్ జరుగుతోంది. షారుక్ ఖాన్ హీరోగా రాక్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కిన 'డంకీ' మూవీ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి.

షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాని కాంబినేషన్ అంటే ఇండస్ట్రీ వర్గాల తో పాటు ఆడియన్స్ లోనూ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రిలీజ్ తర్వాత 'డంకీ' ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేయలేకపోయింది. కలెక్షన్స్ మాత్రమే కాదు రివ్యూస్ కూడా ఏమంత గొప్పగా లేవు. రాజ్ కుమార్ హిరాని సినిమాలంటే ఆడియన్స్ కంటే ముందు సినీ క్రిటిక్స్ సినిమా చూసి ప్రశంసలు కురిపిస్తుంటారు. కానీ డంకీ విషయంలో అలా జరగలేదు. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ తీసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, సంజు, 3 ఇడియట్స్, PK.. లాంటి సినిమాలన్నింటికీ ప్రశంసలతో పాటు వందల కోట్ల వసూళ్లు వచ్చాయి.

కానీ మొట్టమొదటిసారి 'డంకీ' 100 కోట్లు రాబట్టడానికే మూడు రోజులు టైం తీసుకుంది. దాంతో ఇప్పటివరకు బాలీవుడ్ లో అపజయం లేని ఈ దర్శకుడికి డంకీ ద్వారా మొదటి ప్లాప్ రావడం గమనార్హంగా మారింది. ఇక డంకీ రిజల్ట్ తో అప్సెట్ అయిన రాజ్ కుమార్ హిరాని తన నెక్స్ట్ సినిమాని ఇప్పట్లో చేయకపోవచ్చని బాలీవుడ్లో గాసిప్స్ వస్తున్నాయి. షారుక్ ఖాన్ 'డంకీ' కోసమే ఆరేళ్లు టైం తీసుకున్న ఈయన ఇప్పుడు ఫస్ట్ ఫ్లాప్ చవి చూడటంతో నెక్స్ట్ సినిమా కోసం ఇంకెంత టైం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News