నేను సాక్ష్యాలతో చట్టపరంగా ఫైట్ చేస్తా - రాజ్ తరుణ్
లావణ్య మాత్రం తనకి న్యాయం కావాలంటూ చట్టపరంగా పోరాటం చేయడానికి న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర తో కలిసి ఫైట్ చేస్తోంది.
రాజ్ తరుణ్, లావణ్య వివాదం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్ తరుణ్ ని నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నోటీసులకి రాజ్ తరుణ్ నేరుగా పోలీసుల ముందుకి హాజరై సమాధానం చెప్పలేదని టాక్ నడుస్తోంది. లావణ్య మాత్రం తనకి న్యాయం కావాలంటూ చట్టపరంగా పోరాటం చేయడానికి న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర తో కలిసి ఫైట్ చేస్తోంది.
లావణ్య ఆరోపణలపై మొదటి రోజు రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. కేసు నమోదు అయిన తర్వాత ఆయన బయటకి రాలేదు. పురుషోత్తముడు మూవీ రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ కి కూడా హాజరు కాలేదు. ఆగష్టు 2న తిరగబడర సామి మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రెస్ మీట్ లో రాజ్ తరుణ్ మీడియాని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు వివాదంపై రాజ్ తరుణ్ ని నేరుగా ప్రశ్నించారు.
లావణ్య ఆరోపణలపై, పోలీసుల నోటీసులపై మీరెందుకు మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వలేదని మీడియా ప్రతినిధులు రాజ్ తరుణ్ ని ప్రశ్నించారు. ఆరోపణలు చేసినవారు. బయటకొచ్చి మాట్లాడుతారు. నేను ఎలిగేషన్స్ వేయడం లేదు. ప్రతిదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాటితో నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను. భయపడాల్సిన అవసరం అయితే నాకు లేదు. నా దగ్గర ఉన్న ప్రతి ప్రూఫ్ చూపిస్తా. కానీ లీగల్ గానే ఆధారాలతో ఫైట్ చేస్తాను.
లావణ్య చేసిన ఎలిగేషన్స్ ని కి సంబంధించి ప్రతి రోజు మీడియాలో ప్రసారం చేస్తున్నారు. ఏ రోజైన ఒక్క ప్రూఫ్ వారు. అడిగారా… ప్రూఫ్స్ వారు ఇప్పటి వరకు చూపించలేదు. మేము కోర్టులో చూపించుకుంటాం అని చెబుతున్నారు. లావణ్య ఆరోపణలు చేసిన మొదటి రోజు నేను మీడియా ముందుకొచ్చి మాట్లాడాను. ఆ రోజు అన్ని నిజాలే మాట్లాడాను. ఇప్పటికి వాటికి కట్టుబడి ఉన్నాను. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది ప్రతిది వాస్తవం… వాటికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి.
వాటిని దాటి ఇంకా చాలా ప్రూఫ్స్ నా సోదరుడు శేఖర్ భాషా చూపించాడు. ఇంకా చాలా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆవిడకి వ్యతిరేకంగా నేనేమీ చూపించడం లేదు. నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాను అని రాజ్ తరుణ్ తెలిపారు. లావణ్యకి అబార్షన్ చేయించానని పోలీసులకి ఫిర్యాదు చేస్తే దానిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్ లో అబార్షన్ చేయించినట్లు ఎలాంటి సెక్షన్స్ లేవు. పోలీసుల ఇచ్చిన నోటీసులకి నేను తప్పించుకొని తిరగలేదని, వారి ముందు నేను హాజరయ్యానని, సమాధానం కూడా చెప్పానని రాజ్ తరుణ్ మీడియా మీట్ లో లావణ్య ఇష్యూపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.