న్యూడ్ వీడియోలు 47 లక్షలకి అమ్మాడు!
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాఖీపై కూడా ఆదిల్ ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రాఖీ మాజీ భర్త పై నిప్పులు చెరిగింది.
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మాజీ భర్త ఆదిల్ దుర్రానీపై సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లైన కొన్నాళ్లకే విడిపోయిన జంట మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వివాదం నడుస్తోంది. ఇప్పటికే మాజీ ని జైలు కూడా పంపించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాఖీపై కూడా ఆదిల్ ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రాఖీ మాజీ భర్త పై నిప్పులు చెరిగింది.
ఇప్పుడు ఏకంగా బెడ్ రూమ్..బాత్ రూమ్ సన్నివేశాల్నే మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేసింది. ఆదిల్ తన న్యూడ్ వీడియోలను 47 లక్షలకు దుబాయిలో విక్రయించాడని ఆరోపించింది. 'నేను బాత్ రూమ్ లో ఉన్నాను. అతను నన్ను న్యూడ్ గా షూట్ చేసాడు. అలాంటి వీడియోలు అతని వద్ద చాలా ఉన్నాయి. అందులో నేను నగ్నంగా కనిపిస్తా. కొన్ని బెడ్ రూమ్ వీడియోలు కూడా ఉన్నాయి.
నేను అతడి భార్యని. కానీ నాపై అత్యాచారం చేసేవాడు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ప్రపంచం అంతా నా వీడియోలను చూసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలి? సమాజంలో ఎలా తల ఎత్తుకుని తిరగగలను? సాధారణ అమ్మాయిని కాదు. భారత్ లో సెలబ్రిటీని. విషం తాగి ఆత్మ హత్య చేసుకోవాలా' అంటూ రాఖీ సావంత్ వాపోయింది.
ఇంకా మాట్లాడుతూ మహిళలతో పాటు అతడు పురుషుల్ని కూడా లైంగికంగా ఇబ్బంది పెడతాడు. ఓ ఇరానీ అమ్మాయితో ఐదేళ్లు కలిసి ఉన్నాడు. ఇలాంటి వారు అతని జాబితాలో చాలా మంది ఉన్నారు. ఎంతో మందిన మోసం చేసిన చరిత్ర అతనిది' అని ఆరోపించింది.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాఖీ సావంత్ ఫిర్యాదు మేరకు ఆదిల్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. అతను ఇటీవలే విడుదలయ్యాడు.