తప్పు చేశా.. రకుల్ షాకింగ్ కామెంట్స్..!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో సత్తా చాటుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.

Update: 2024-12-09 23:30 GMT

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో సత్తా చాటుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఆమె స్టార్ ఇమేజ్ కొన్నాళ్లే కొనసాగించినా ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది రకుల్. పెళ్లి తర్వాత కెరీర్ లో మారుపు వస్తాయని భావించగా అలాంటిది ఏమి జరిగినట్టు లేదని అనిపిస్తుంది. ఐతే సౌత్ లో పెద్దగా ఛాన్స్ లు లేని రకుల్ కి బాలీవుడ్ లో మాత్రం ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఈమధ్యనే బ్యాక్ పెయిన్ తో రెస్ట్ తీసుకుంటున్న రకుల్ తనలా మరొకరు అలాంటి తప్పు చేయొద్దని అంటుంది.

కొన్ని వారాలుగా సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్న రకుల్ లేటెస్ట్ గా తన ఇన్ స్టా ఫాలోవర్స్ తో స్పెషల్ చాట్ చేసింది. ఈ సందర్భంగా రకుల్ హెల్త్ గురించి ఆమె ఫ్యాన్స్ అడిగి తెలుసుకున్నారు. ఏమైపోయారు అంటూ అడిగిన ఫ్యాన్స్ కి రకుల్ ఏమి అవ్వలేదు ఎక్కడికి పోలేదు. జస్ట్ రెస్ట్ లో ఉన్నా.. బ్యాక్ పెయిన్ వల్ల 8 వారాలు రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారు అందుకే కంప్లీట్ రెస్ట్ మోడ్ లో ఉన్నానని చెప్పింది రకుల్.

ఐతే వెన్నెముక నొప్పికి తాను బరువైనది ఎత్తడం వల్లే అని చెప్పింది రకుల్. శరీరం చెప్పే మాట.. ఇచ్చే సంకేతాలను మనం గుర్తించాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని అంటుంది రకుల్. తాను ఎక్కువ బరువు మోయడం వల్ల ఇలా ఇబ్బందులు పడుతున్నా నాలా ఎవరు ఆ తప్పు చేయకండి అని అంటుంది రకుల్. ఐతే తన ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ తన నుంచి 3 సినిమాలు రిలీజ్ అవుతాయని చెప్పింది. దే దే ప్యార్ దే 2 చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఆ సినిమా రిలీజ్ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నా అని రకుల్ అన్నది.

తెలుగులో దాదాపు కెరీర్ మీద ఆశలు వదులుకున్న రకుల్ బాలీవుడ్ మీద పూర్తి ఫోకస్ చేస్తుంది. అక్కడ గ్లామర్ పరంగా కూడా నో లిమిట్స్ అనేస్తూ అదరగొట్టేస్తుంది అమ్మడు. ఇక బెస్ట్ ఫ్రెండ్ నే పెళ్లాడటం వల్ల పెళ్లి తర్వాత పెద్దగా మార్పులు ఏమి లేవని ఇంకా అతనితో ఉండటం వల్ల ఎప్పుడూ హ్యాపీగా ఉందని అంటుంది రకుల్. ఐతే త్వరలోనే పూర్తిగా రికవర్ అయ్యి మళ్లీ షూటింగ్స్ మొదలు పెడతానని చెప్పింది రకుల్.

Tags:    

Similar News