రకుల్ మెడలో మంగళ సూత్రంపై ఇన్ని సందేహాలా?
ఆ మంగళ సూత్రం తెలుపు వర్ణం పొడి డిజైన్ తోచేసినట్లు ఉంది. చూస్తుంటే డైమండ్ మంగళ సూత్రంలా ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. మూడు రోజుల పెళ్లి వేడుక ఎంతో వైభవంగా ముగించుకుని వెకేషన్ కి రెడీ అవుతున్నారు. మరి దంపతులిద్దరు వెకేషన్ ఏ దేశంలో ప్లాన్ చేస్తున్నారు? అన్నది తెలియాలి. ఇక రకుల్ సంప్రదాయలకు ..పద్దతుల్ని బాగానే రెస్పెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు.ఎంత మోడ్రన్ యుగంలో ఉన్న పాటించాల్సిన కనీస నియమ నిబంధనలు రకుల్ తూచ తప్పకుండా పాటిస్తున్నట్లే కనిపిస్తుంది.
సాధారణంగా పెళ్లైన తర్వాత మెడలో తాళిబొట్టు అనేది హీరోయిన్లు ఉంచుకోవడం అన్నది చాలా రేర్. వివాహం అనంతరం తాళి బొట్టు తీసి పక్కనబెట్టేస్తుంటారు. ఆ తర్వాత కొంత మంది గుర్తుగా చిన్న చైన్ ధరిస్తారు. లేదంటే ఖాళీ మెడతోనే కనిపిస్తారు. కానీ రకుల్ మాత్రం అలా చేయలేదు. తాళికి బధులుగా మంగళ సూత్రం ఉన్న చైన్ ని ధరించింది. మంగళసూత్రాలు అంటే రెండు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మగంళ సూత్రంతోనే చైన్ తయారు చేయించి దాన్నే రకుల్ మెడలో గుర్తుగా దరించింది.
ఆ మంగళ సూత్రం తెలుపు వర్ణం పొడి డిజైన్ తోచేసినట్లు ఉంది. చూస్తుంటే డైమండ్ మంగళ సూత్రంలా ఉంది. తాజాగా రకుల్-జాకీ కలిసి దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. పెళ్లైన తర్వాత ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు చిక్కిన ఫోటోలా ఉంది. అందులోనే రకుల్ మంగళ సూత్రం మ్యాటర్ బయటకొ చ్చింది. అయితే ఆ మంగళ సూత్రం ధర ఎంత? అంటూ అభిమానులు అడగడం మొదలు పెట్టేసారు.
నూతన దంపతులకు విషెస్ తెలియజేస్తూనే ధర తెలసుకే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరికొంత మంది అది మంగళ సూత్రం కాదని....గోల్డ్ చైన్ విత్ డైమండ్ అంటూ చెబుతున్నారు. వివాహం అనంతరం భర్త కానుకగా ఇచ్చిన చైన్ వేసుకుందని అంటున్నారు. మరి ఆ సంగతేంటో తేలాలంటే రకుల్ లైన్ లోకి రావాలి. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.