పిక్ టాక్‌ : అందాల రకుల్‌ కవ్వింపులు

తాజాగా రెడ్‌ డ్రెస్ లో కవ్వించే చూపులతో భలే ఉందే అంటూ నెటిజన్స్ ని కవ్వించింది. అందాల రకుల్‌ కవ్వింపుల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Update: 2024-07-04 11:22 GMT

కేరింత సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగు లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మొదటి విజయాన్ని సొంతం చేసుకుని తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఒకానొక సమయంలో చేతిలో అర డజను సినిమాలు చేస్తూ వచ్చింది.

 

హీరోయిన్‌ గా టాలీవుడ్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో కూడా బిజీ బిజీగా సినిమాలు చేసిన ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కడం లేదు. అయినా కూడా సోషల్‌ మీడియాలో వరుసగా ఫోటో షూట్స్ తో వైరల్‌ అవుతూనే ఉంది.

 

తాజాగా రెడ్‌ డ్రెస్ లో కవ్వించే చూపులతో భలే ఉందే అంటూ నెటిజన్స్ ని కవ్వించింది. అందాల రకుల్‌ కవ్వింపుల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం. అయినా కూడా ఈ అమ్మడికి దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు.

 

ఈ స్థాయి అందాల ఆరబోత చేసినా కూడా హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఆఫర్లు దక్కడం లేదు అనేది కొందరి అభిప్రాయం. రకుల్‌ ప్రీత్‌ సింగ్ తాజా ఫోటో షూట్‌ తో కవ్విస్తున్న తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదే స్థాయిలో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు హీరోయిన్‌ గా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 లో రకుల్‌ ప్రీత్‌ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో కూడా ఈ అమ్మడు పాల్గొంది. ఇండియన్ 2 తర్వాత ఈమె మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.

Tags:    

Similar News

eac