ఎక్స్ ప్రెస్ లేకపోతే నేను లేను!
ఆ సినిమా విజయంతోనే తెలుగులో బిజీ అయింది. స్టార్ హీరోలతో అవకాశం అందుకో గలిగింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ఇప్పుడెంత? బిజీగా ఉందో తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అమ్మడు అటుపై హిందీ పరిశ్రమలో సక్సెస్ దిశగా అడుగులేస్తుంది. సరైన హిట్ పడకుండానే అమ్మడు వచ్చిన అవకాశాలతో బిజీ అవుతుంది. స్టార్ హీరో సరసన ఓ విజయం అందు కుంటే? రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. అమ్మడి కెరీర్ ఇలా ఇన్ని రకాలుగా బిల్డ్ చేయడానికి కారణం మాత్రం `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`.
ఆ సినిమా విజయంతోనే తెలుగులో బిజీ అయింది. స్టార్ హీరోలతో అవకాశం అందుకో గలిగింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్తుంది. తాజాగా `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` రిలీజ్ అయి పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈసినిమా విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. `నా ప్రయాణంలో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా నాకు జీవితాన్ని ఇచ్చింది.
ఇలాంటి ప్రత్యేకమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమాభిమానలు చూపించిన కారణంగా ఈ స్థాయిలో ఉన్నాను` అంది. వాస్తవానికి రకుల్ `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` కంటే ముందు `కెరటం` అనే ఓ సినిమాలో నటించింది. కానీ ఇది తమిళ్ ..తెలుగులో తెరకెక్కించారు. ఆ రకంగా తొలిసారి తెలుగు తెరపై ఎక్స్ ప్రెస్ కంటే ముందుగానే కనిపించింది.
కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` లో ఛాన్స్ వచ్చింది. నటిగా తొలిసారి తెరకు పరిచయమైంది మాత్రం కన్నడ చిత్రం `గిల్`. శాండిల్ లో ఉడ్ లో ఇప్పటి వరకూ రకుల్ నటించిన అదే తొలి చిత్రం..చివరి చిత్రం కూడా. కోలీవుడ్..టాలీవుడ్లో ఛాన్సులు రావడంతో మళ్లీ అటువైపు చూడలేదు.