రానా ఇలాంటి షాకులు ఇస్తే ఎలా..?

ఐతే ఈ చిట్ చాట్ లోనే తాను ఫిక్సెడ్ హెయిర్ వాడతానని అన్నాడు రానా. దాంతో దుల్కర్ కూడా షాక్ అయ్యాడు. అంతేకాదు రానా నిజాయితీకి సూపర్ అనేశాడు దుల్కర్ సల్మాన్.

Update: 2024-10-30 08:18 GMT

తెర మీద హీరోలు పాత్రకు తగినట్టుగా వారి ఆహార్యం ఉంటుంది. పాత్ర ఏదైనా సరే అందుకు తగిన మేకప్, లుక్ అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఐతే వెరైటీ గెటప్ అయితే హెయిర్ స్టైల్ విషయంలో కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు. ఈ హెయిర్ స్టైల్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఐతే ఎంచుకున్న పాత్రకు పర్ఫెక్ట్ లుక్ కావాలంటే కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఐతే హెయిర్ విషయానికి వస్తే విగ్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయ్యింది. ఒకప్పుడు అంటే విగ్ గురించి పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు చూడగానే గుర్తు పట్టేస్తున్నారు.

ఐతే కొందరు హీరోలు వారు విగ్ పెట్టుకున్నా కూడా పెద్దగా తేడా తెలియదు. ఆన్ స్క్రీన్ మీద కాదు ఆఫ్ స్క్రీన్ రియల్ లైఫ్ లో కొందరు హీరోలు విగ్ వాడుతుంటారు. అది తలకు ఫిక్స్ అయినట్టుగానే ఉంటుంది. దానికి చాలా రకాల అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. అందుకే ఏది రియల్ హెయిర్ ఏది విగ్ అన్నది కనిపెట్టడం కష్టం. స్వయంగా వారు చెబితేనే అది విగ్ లేదా రియల్ హెయిర్ అన్నది తెలుస్తుంది. లేటెస్ట్ గా దగ్గుబాటి హీరో రానా తన ఫిక్సెడ్ హెడ్ ఆఫ్ హెయిర్ గురించి ప్రస్తావించి అందరికీ షాక్ ఇచ్చాడు.

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాలో దుల్కర్ ఒత్తైన జుట్టుతో కనిపించాడు. ఆ హెయిర్ స్టైల్ గురించి దుల్కర్ ని అడిగితే అది పెంచేందుకు చాలా టైం పట్టిందని అన్నాడు దుల్కర్. ఐతే ఈ చిట్ చాట్ లోనే తాను ఫిక్సెడ్ హెయిర్ వాడతానని అన్నాడు రానా. దాంతో దుల్కర్ కూడా షాక్ అయ్యాడు. అంతేకాదు రానా నిజాయితీకి సూపర్ అనేశాడు దుల్కర్ సల్మాన్.

సినిమాలో హీరో హెయిర్ పెంచాడని ఇప్పటివరకు తన హెయిర్ గురించి అసలేమాత్రం డౌట్ రాకుండా జాగ్రత్త పడ్డ రానా తన హెయిర్ ని హెడ్ మీద ఫిక్స్ చేశానని చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. రానా కామెంట్స్ విన్న ఆడియన్స్ ఏంటి రానాది ఒరిజినల్ హెయిర్ కాదా ఎందుకు రానాకి హెయిర్ కి ఏమైంది అని డౌట్ పడుతున్నారు. రానా హెయిర్ గ్రోత్ కి సంబందించి ఎలాంటి డీటైల్స్ ఇవ్వలేదు కానీ తను కూడా ఫిక్సెడ్ హెడ్ ఆఫ్ హెయిర్ వాడుతానని అన్నాడు. దానికి రానాది కూడా విగ్గే అని డిసైడ్ అయిపోయారు.

ఏది ఏమైనా తన ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది. ఇది చెప్పాల్సిన అవసరం లేదు కదా అని ఫిల్టర్స్ ఏమి లేకుండా రానా తన మనసులో మాటని బయట పెడుతుంటాడు. అందుకే రానాలోని ఈ క్వాలిటీ అతన్ని ఇష్టపడేలా చేస్తుంది. ఐతే కేరళలో ఎక్కువగా కొబ్బరి నూనె దొరుకుతుంది కాబట్టి అక్కడ వారి హెయిర్ చాలా బాగుంటుందని రానా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చర్చించడం విశేషం.

Tags:    

Similar News