రానాతో, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్… అయితే చిన్న ట్విస్ట్

దీంతో పాటు దుల్కర్ సల్మాన్ సొంత ప్రొడక్షన్ హౌస్ వెఫరీర్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సౌత్ భాషలలో ఆవిష్కరించబోతున్నాయి

Update: 2023-07-29 09:24 GMT

టాలీవుడ్ లో మహానటి, సీతారామం సినిమాలతో సూపర్ మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తెలుగులో తన మూడో చిత్రాన్ని ఎనౌన్స్ చేసేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లక్కీ భాస్కర్ అనే టైటిల్ తో మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోటా మూవీ పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నారు.




 


దీని తర్వాత వెంకీ అట్లూరి సినిమాని సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె తాజాగా దుల్కర్ సల్మాన్ నుంచి మరో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందంట. కాంత అనే టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ తో కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా ఆవిష్కరించారు.

ఇక ఈ మూవీని దుల్కర్ సల్మాన్ తన సొంతం బ్యానర్ పై నిర్మించబోతున్నారు. అలాగే టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామి కాబోతున్నారు. రానా సురేష్ ప్రొడక్షన్ కాకుండా స్పిరిట్ మీడియా అనే కొత్త నిర్మాణ సంస్థని స్టార్ట్ చేశారు.

దీంతో పాటు దుల్కర్ సల్మాన్ సొంత ప్రొడక్షన్ హౌస్ వెఫరీర్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సౌత్ భాషలలో ఆవిష్కరించబోతున్నాయి.

కాంత టైటిల్ బట్టి చూస్తూ ఉంటే ఇదేదో హర్రర్ బ్యాక్ డ్రాప్ మూవీలా ఉంది. ఓ భవనంలో పైన కనిపించిన శాండిలియర్ ని హీరో చూస్తున్నాడు. దాని నుంచి వస్తోన్న లైటింగ్ లో బ్లాక్ కలర్ పోస్టర్ అంతా ఆవిష్కరించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు.

ఇతర పాత్రల కోసం క్యాస్టింగ్ ప్రస్తుతం జరుగుతుందంట. త్వరలో ఈ మూవీకి సంబందించిన నటీనటులతో పాటు క్రూ ఎవరనేది కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇక సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేదానిపై క్లారిటీ లేదు. ఏది ఏమైనా దుల్కర్ సల్మాన్ మాత్రం ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలతో తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నారని చెప్పాలి.

Tags:    

Similar News