షాకింగ్: స్టార్ కిడ్ ఫ్రాక్ వెల‌ 2ల‌క్ష‌లు

తాజాగా రాహా క‌పూర్ క‌ళ్లు చెదిరే డిజైన‌ర్ గౌను ధ‌రించి తన అమ్మమ్మ నీతు కపూర్‌తో కలిసి పాఠశాలకు బ‌య‌ల్దేరింది.

Update: 2025-02-18 08:30 GMT

క‌పూర్ ఫ్యామిలీ లెగ‌సీని న‌డిపించే వార‌సురాలిగా క్యూట్ రాహా క‌పూర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆలియా-ర‌ణ‌బీర్ క‌పూర్ దంప‌తుల గారాల ప‌ట్టీ క్యూట్ లుక్స్, అల్ల‌రి గురించి అభిమానులు చాలా మురిపెంగా చెప్పుకుంటున్నారు. రిషీ క‌పూర్ పోలిక‌ల‌తో రాహా మెస్మ‌రైజ్ చేస్తుంద‌ని, తాత‌లోని నిర్ల‌క్ష్య వైఖ‌రి రాహాలో క‌నిపిస్తుంద‌ని ఫ్యాన్స్ చెబుతున్నారు. క‌పూర్ వంశ లిటిల్ ప్రిన్సెస్ ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లోను త‌న త‌ల్లి ఆలియాను మించిపోతోంది. త‌న స్థాయికి త‌గ్గ వ‌స్త్ర‌ధార‌ణ‌తో రాహా నిరంత‌రం చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

తాజాగా రాహా క‌పూర్ క‌ళ్లు చెదిరే డిజైన‌ర్ గౌను ధ‌రించి తన అమ్మమ్మ నీతు కపూర్‌తో కలిసి పాఠశాలకు బ‌య‌ల్దేరింది. క్యూట్ రాహా ధ‌రించిన తెల్ల గౌను ఆకర్ష‌ణ‌, మిరుమిట్ల గురించి, గౌను ఖ‌రీదు గురించి అభిమానులు ముచ్చ‌టించుకుటున్నారు. ఈ గౌను ఖ‌రీదు అక్ష‌రాలా రెండు ల‌క్ష‌లు(2ల‌క్ష‌లు). రాహా క్రీమ్ క‌ల‌ర్‌ లేస్ డ్రెస్‌లో షార్ట్ స్లీవ్స్ తో అందంగా క‌నిపించింది. ఈ గౌను ధ‌ర ఆన్ లైన్ లో రూ.1,59,743 గా చూపిస్తోంది. ఇది ఏ బ్రాండ్ అనేది అటుంచితే ఖ‌రీదుకు త‌గ్గ‌ట్టు ఎంతో విలాసవంతంగా క‌నిపించింది. రాహా అప్పియ‌రెన్స్‌ ని ఇది మ‌రింతగా ఎలివేట్ చేసింద‌ని చెప్పాలి.

త‌మ కుమార్తెను ఆలియా- ర‌ణ‌బీర్ ఎంత అల్లారు ముద్దుగా పెంచుతున్నారో ఈ ఎంపిక‌లు తెలియ‌జేస్తాయి. రాహా క‌పూర్ ఫ్యామిలీ ల‌క్కీ ఛామ్‌. ఇలా పుట్ట‌గానే అలా రూ. 250 కోట్ల విలువ చేసే ఖ‌రీదైన ఆస్తిని త‌న కుమార్తెకు కానుకిచ్చాడు ర‌ణ‌బీర్ కపూర్. తండ్రి నుంచి వార‌స‌త్వ సంప‌ద‌ను కూతురికి ధారాద‌త్తం చేసాడు. ఆలియా 550కోట్ల ఆస్తి, ర‌ణ‌బీర్ 350 కోట్ల ఆస్తిని క‌లుపుకుని ఓవ‌రాల్ గా రూ. 850 కోట్ల ఆస్తికి ప్ర‌స్తుత‌ వార‌సురాలు రాహా క‌పూర్. త‌న స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో యువ‌రాణిలా ఆ కుటుంబంలో పెరుగుతోంది. స‌క‌ల సౌక‌ర్యాల‌తో పాటు, త‌న‌కు ఏం కావాల‌న్నా క్ష‌ణాల్లో అందించే మామ్ డాడ్ ఉన్నారు. క‌పూర్ ప్రిన్సెస్ ఏ వేదిక‌కు వెళ్లినా అక్క‌డ కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారుతూ త‌న క్యూట్ లుక్స్ తో ఆక‌ర్షిస్తూనే ఉంది. తాజాగా రాహా ధ‌రించిన తెల్ల గౌన్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్‌కి వ‌స్తే... ర‌ణబీర్ క‌పూర్ ప్ర‌స్తుతం నితీష్ కుమార్ రామాయ‌ణం స‌హా ప‌లు భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. ఆలియా భ‌ట్ కొద్దిరోజులుగా విరామం తీసుకుని య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఆల్ఫాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News