'యానిమల్' మూడు భాగాల్లోనూ రష్మిక ఫిక్సైపోయింది!
`యానిమల్` తో రణబీర్ కపూర్ -రష్మిక మందన్నా కాంబినేషన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు
`యానిమల్` తో రణబీర్ కపూర్ -రష్మిక మందన్నా కాంబినేషన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో యాక్షన్ ఓ ఎత్తైతే? ఇద్దరి రొమాంటిక్ పెర్పార్మెన్స్ మరో ఎత్తుగా నిలిచింది. రణబీర్ భార్య పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. నేచురల్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంది. దీంతో ఇదే కాంబినేషన్ `యానిమల్` పార్క్ లోనూ యధా విధిగా రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. తాజాగా `యానిమల్` నుంచి ఇంకా మూడు భాగాలు రిలీజ్ అవుతాయని సందీప్ వంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ముడు భాగాల్లో కూడా రష్మిక కొనసాతుందా? అన్న సందేహం రావడం సహజం. ఎందుకంటే బాలీవుడ్ లో హిట్ సినిమాకు సీక్వెల్స్ చేసినా? కొనసాగింపు కథలైనా హీరోయిన్ విషయంలో మార్పులు జరుగుతుంటాయి. కొత్త హీరోయిన్ తెస్తే ప్రేక్షకుడికి ప్రెష్ ఫీలింగ్ కలుగుతుందనే టాక్ ఉంది. కొన్నిసందర్భాల్లో హీరో సైతం మారిపో తుంటాడు. కానీ సందీప్ వంగ ఆ ఛాన్స్ తీసుకోలేదు. `యానిమల్` అన్ని భాగాల్లోనూ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తాడు.
అలాగే హీరోయిన్ గా కూడా రష్మిక కొనసాగుతుందని అమ్మడు ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేసింది. మూడు భాగాలు తీయడం అన్నది సాధారణ ప్రేక్షకులతో పాటు తనకు ఆనందమేనని ఆ ఛాన్సులన్నీ తనవే అన్నట్లు మాట్లాడింది. అలాగే సందీప్ రెడ్డికి ఓ మంచి సలహా వదిలింది. ఈసారి ఆటను మరింత వేగంగా ఆడాల్సి ఉంటుం దని సూచించింది. మరి ఆ ఆట యాక్షన్ లోనా? రొమాన్స్ లోనా? అన్నది చిన్నది క్లారిటీ ఇవ్వలేదు సుమీ.
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో `ఛావా` సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇందులో అమ్మడు మహారాష్ట్ర క్వీన్ పాత్ర పోషించింది. అమ్మడు తొలిసారి ప్రిన్సెస్ పాత్ర పోషిస్తుంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా వాస్తవానికి `పుష్ప-2`తో పాటు రిలీజ్ అవ్వాలి. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు దొరక్కపోవడంతో? వాయిదా పడింది. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతుంది.