కుబేర వైరల్ లుక్.. రష్మిక ప్రయాణం ఎక్కడికి?

ఇక కథ ఎంతో డిఫరెంట్ గా ఉంటేగాని సినిమా చేయని ధనుష్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Update: 2024-07-02 15:30 GMT

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘కుబేర’ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో పప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా సరికొత్తగా ఉండబోతోందని కాంబినేషన్ తోనే క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కాలం తరువాత పూర్తిగా కొత్త తరహా కంటెంట్ తో కుబేర సినిమాను రూపొందిస్తున్నారు. ఇక కథ ఎంతో డిఫరెంట్ గా ఉంటేగాని సినిమా చేయని ధనుష్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు.


ఇక సినిమాలో ధనుష్ కు జోడిగా రశ్మిక నటిస్తోంది. ఇక రష్మిక మందన్న మొదటి లుక్‌ జూలై 5న విడుదల కానుంది. ప్రముఖ జాతీయ అవార్డు విజేత దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడంతో ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.

పోస్టర్‌లో రష్మిక గులాబీ రంగు డ్రెస్‌లో, వెనుక ఒక సూట్‌కేస్‌ను ఈడ్చుకుంటూ ఒక అమానుష ప్రదేశంలో కనిపిస్తుంది. ఈ సింపుల్ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఆమె పూర్తి లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలై 5న అధికారిక లుక్ విడుదల కానుంది. ‘కుబేర’ చిత్రంలో కింగ్ నాగార్జున అక్కినేని స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

ఇదివరకే ఆయనకు సంబంధించిన టీజర్ విడుదలవగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. గతంలో ఈ ఇద్దరి ఫస్ట్ లుక్స్ విడుదలై మంచి స్పందన అందుకున్నాయి. ఈ చిత్రం పాన్-ఇండియా సౌండ్ ట్రాక్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు అమిగోస్ క్రియేషన్స్ పివిటి లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more!

తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. శేఖర్ కమ్ముల ఈ సినిమాలో సామాజిక అంశాలను ప్రధానంగా చూపిస్తూ, ప్రేక్షకులకు చక్కటి సందేశాన్ని అందించనున్నారు. గతంలో తన సినిమాలతో గొప్ప కథలు చెప్పిన శేఖర్ కమ్ముల, ఈ చిత్రంలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించనున్నారు. విడుదలైన రష్మిక లుక్‌తో ‘కుబేర’ చిత్రం మీద మరింత హైప్ క్రియేట్ అయింది. జూలై 5న విడుదల కాబోయే పూర్తి లుక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక పాత్ర ఈ సినిమాలో ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుందో చూడాలి

Tags:    

Similar News

eac