కుబేర రష్మిక.. రాత్రి సమయంలో అలా..

తాజాగా, ఈ సినిమాలో రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ విడుదలైంది.

Update: 2024-07-05 09:22 GMT

జాతీయ అవార్డు విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేరా' సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. సూపర్ స్టార్ ధనుష్ మరియు కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా ఫినిష్ అయ్యింది. ఇక ఏషియన్, ఆమిగోస్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్ మరియు నాగార్జున పాత్రల టీజర్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

తాజాగా, ఈ సినిమాలో రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ రోజు విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్, ఆమె పాత్ర పరిచయం చేస్తూ ఉన్న వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ లో రష్మిక తన తీరుగా సరికొత్త అవతారంలో కనిపిస్తోంది. రష్మిక ధనుష్ మరియు నాగార్జున మధ్య కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె లుక్ కొత్తదనంతో, ఆసక్తి రేపేలా ఉంది.

శేఖర్ కమ్ముల ప్రత్యేకత ఏమిటంటే, ఆయన తెరకెక్కించే సినిమాలు అందమైన విజువల్స్ తో పాటు వాస్తవికతను కలగలిపి ఉండడం. 'కుబేరా' సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ చిత్రం మైథలాజికల్ ఫార్మాట్ లో, సోషల్ డ్రామా అంశాలను కలగలిపినట్టు అనిపిస్తోంది. రాత్రి నిశ్శబ్దంలో రష్మిక పాత్ర వివిధ రహస్యాలను తెరపై ఆవిష్కరిస్తూ ఉంటాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ వీడియోకి అదనపు ఆకర్షణగా నిలిచింది.

Read more!

ఈ సినిమాలో మరికొందరు స్టార్స్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పాన్-ఇండియా సినిమాగా, తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు ఆమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్ మరియు పుస్కర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. వరుస అప్డేట్స్ తక్ 'కుబేరా' చిత్రం మీద ఉన్న అంచనాలు ఎంతగానో పెరిగాయి. రష్మిక ఫస్ట్ లుక్ తో ఈ అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. ఇక సినిమా విడుదలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News

eac