రష్మిక ప్లేస్ కి త్రిష ఎసరు పెడుతుందా?
'స్టాలిన్' తర్వాత ఇద్దరు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ పెయిర్ పై అభిమనులెంతో కాన్పిడెంట్ గా ఉన్నారు.
అందాల త్రిష సెకెండ్ ఇన్నింగ్స్ ని స్పీడప్ చేసిన సంగతి తెలిసిందే. 'పొన్నియ్ సెల్వన్' తర్వాత భాషతో సంబంధం లేకుండా కమిట్ మెంట్ల జోరు పెంచింది. తమిళ్ చిత్రాలతో పాటు తెలుగు...మలయాళం సినిమాలకు సైన్ చేస్తుంది. ఇప్పటికే 17 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'స్టాలిన్' తర్వాత ఇద్దరు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ పెయిర్ పై అభిమనులెంతో కాన్పిడెంట్ గా ఉన్నారు.
త్రిష బ్యూటీ మరోసారి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే మాలీవుడ్ మరో సీనియర్ హీరోతోనూ రొమాన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు మళ్లీ బాలీవుడ్ లోనూ కంబ్యాక్ అవుతుంది.
మళ్లీ 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెడుతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో 'సికందర్' ప్రారంభమై సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికైనట్లు ప్రచారం సాగుతోంది.
వాస్తవానికి ఆ పాత్రలో నయనతారని తీసుకోవాల్సి ఉండగా..ఆమె రిజెక్ట్ చేయడంతో రష్మికని తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే సల్మాన్ సరసన ఆ రోల్ కి రష్మిక ఎంతవరకూ యాప్ట్ అవుతుంది? అన్నది తెలియాల్సిన అంశం. ఎందుకంటే ఇద్దరి మధ్య వయసు వత్యాసం 30 ఏళ్లు ఉంది. రష్మిక వయసు 28 కాగా సల్మాన్ వయసు 56. ఇంత వత్యాసం మధ్య ఇద్దరి మధ్య రొమాన్స్ అంటే బ్యాలెన్స్ అవ్వడం కూడా కష్టమన పనే.
ఈ నేపథ్యంలో తాజాగా త్రిష పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. మరి త్రిష పేరు పరిశీలన అన్నది రష్మిక కి రీప్లేస్ మెంట్ అవుతుందా? లేక మెయిన్ లీడ్ లో త్రిషని పెడుతున్నారా? రష్మిక సెకెండ్ లీడ్ అవుతుందా? ఇలా కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. త్రిష మెయిన్ లీడ్ అయితే సల్మాన్ వయసుకి సరిపోతుంది. ఇప్పటికే త్రిష 40 ప్లస్ లో ఉంది కాబట్టి సల్మాన్ కి పర్పెక్ట్ పెయిర్ గా సూటవుతుంది.
అలా భావిస్తే గనుక రష్మిక సెకెండ్ లీడ్ అవుతుంది? లేక రష్మిక ఎంట్రీ అన్నదే అవాస్తవంగా పరిగణించాల్సి ఉంటుందా? అన్నది చూడాలి. ఇప్పటికే త్రిష 'కట్టా మిట్టా'తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన ఆ సినిమాలో జిల్లా కలెక్టర్‌గా నటించింది. ఆతర్వాత మరో హిందీ సినిమాలో నటించలేదు. ఆ సినిమా ప్లాప్ తర్వాత మళ్లీ హిందీలో అవకాశాలు రాలేదు.