పుట్టిన‌రోజున ర‌ష్మిక‌ జిమ్‌లో ఏంటా ప‌ని?

త‌న‌కు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన‌ అభిమానుల ప్రేమాభిమానాల‌కు ధన్యవాదాలు తెలిపింది

Update: 2024-04-06 11:43 GMT

రష్మిక మందన్న తన 28వ పుట్టినరోజు వేడుకలను జిమ్‌లో జరుపుకుంది. కోచ్ స‌మ‌క్షంలో ఎంతో హార్డ్ గా శ్ర‌మిస్తున్న‌ రష్మిక తనకు తాను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి కొంత బ్రేక్ తీస్కుంది. కానీ త‌న‌కు పండ‌గ‌లు ప‌బ్బాలు వేడుక‌లు ఇవేవి జిమ్ కి అడ్డంకిగా ఉండ‌బోవ‌ని చెప్ప‌క‌నే చెబుతోంది. త‌న‌కు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన‌ అభిమానుల ప్రేమాభిమానాల‌కు ధన్యవాదాలు తెలిపింది.

ఏప్రిల్ 5న రష్మిక మందన్న తన 28వ పుట్టినరోజును జరుపుకుంది. అయితే బ‌ర్త్ డే బేబి ఏదో ఒక షాక్ చెప్పి వర్కవుట్ షెడ్యూల్‌ ని మాత్రం స్కిప్ కొట్ట‌లేదు. తాను విహారయాత్రలో ఉన్నా కూడా ఫిట్‌నెస్ విష‌యంలో తన నిబద్ధతకు కట్టుబడి ఉంది. తన పుట్టినరోజు వ్యాయామ దినచర్యను తన అనుచరులతో షేర్ చేయ‌డం ద్వారా అంద‌రిలో స్ఫూర్తిని నింపింది. తన ట్రైనర్ మార్గదర్శకత్వంలో శ్రద్ధగా ర‌ష్మిక క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియో ఆస‌క్తిని క‌లిగించింది. ఫుటేజ్ లో ర‌ష్మిక ఫిట్ అవ‌తార్ అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఓవైపు బ‌ర్త్ డే వేడుకలకు స‌మ‌యమాస‌న్న‌మైనా కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాల్సిన‌ ప్రాముఖ్యతను గుర్తు చేసింది ర‌ష్మిక‌.

''పుట్టినరోజున కూడా లిటిల్ వర్కౌట్‌లో ఉన్నాను.. నేను ఎంత మంచి శిష్యురాలినో చూడండి.. కోచ్ జునైద్ షేక్ చివరికి మీ ప్రేమ ఆప్యాయ‌త‌ను చూసిన తర్వాత సంతోషంగా లిల్ డ్యాన్స్ చేయాల‌నిపించింది'' అని ర‌ష్మిక ఇన్స స్టాలో రాసింది. తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో ఫిట్‌నెస్ బాల్‌ను ఉపయోగించి ప్లాంక్ ఎక్సర్‌సైజ్‌ను ఎగ్జిక్యూట్ చేస్తూ, తన బలం బ్యాలెన్స్‌ని ప్రదర్శిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

యానిమల్ భారీ విజయం తర్వాత రష్మిక మందన్న వ‌రుస‌గా భారీ సినిమాల్లో న‌టిస్తోంది. పుష్ప 2 ఈ ఏడాదిలోనే విడుద‌ల కానుంది. ఇందులో అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ శ్రీవల్లిగా నటించింది. మొదటి భాగంలో పోషించిన అదే పాత్ర సీక్వెల్ లోను కొన‌సాగుతుంది. ది గర్ల్‌ఫ్రెండ్‌లోను ర‌ష్మిక‌ న‌టిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రేమ‌క‌థా చిత్రం ర‌ష్మిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాగే ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలోకి డైవింగ్ చేస్తూ విక్కీ కౌశల్‌తో స్క్రీన్‌ను షేర్ చేస్కోనుంది. చావా అనేది ఈ మూవీ టైటిల్. ఇది చారిత్రక క‌థాంశంతో రూపొందింది.

Tags:    

Similar News