మళ్ళీ బాలయ్యతో పోటీకి దిగుతున్న మాస్ హీరో

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-13 06:08 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ పెట్టని ఈ మూవీ షూటింగ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ బాలయ్య స్టైల్ యాక్షన్ కథాంశంతోనే ఉండబోతోందంట. ఈ ఏడాదిలోనే ఎన్.బి.కె 109 మూవీ రిలీజ్ కాబోతోంది. ఇంకా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం దర్శకుడు బాబీ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో మిస్టర్ బచ్చన్ సినిమాని నిర్మిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ అయ్యింది.

మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరు కలిసి మిస్టర్ బచ్చన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి హరీష్, రవితేజతో సినిమా చేయాలని అనుకుంటున్న అవకాశం దొరకలేదు. అయితే హరీష్ పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ వాయిదా పడటంతో మిస్టర్ బచ్చన్ చేయడానికి టైం దొరికింది. ఇక బాలయ్య, రవితేజ చాలా సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. కొన్ని సార్లు ఇద్దరు సమానంగా సక్సెస్ అందుకుంటే మరికొన్ని సార్లు ఒకరిపై మరొకరు డామినేషన్ చూపించారు.

గత ఏడాది బాలయ్య భగవంత్ కేసరితో వస్తే రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఈ పోటీలోక్ బాలయ్య విన్ అయ్యారు. భగవంత్ కేసరి మూవీ సూపర్ హిట్ అయ్యింది. మరోసారి ఎన్.బి.కె 109, మిస్టర్ బచ్చన్ సినిమాలతో బాలయ్య రవితేజ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 27న ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. మరి ఈ సారి పోటీలో ఎవరు విన్ అవుతారనే ఆసక్తి పబ్లిక్ లో ఉంది.

ఇద్దరు కూడా వారి వారి సినిమాల విషయంలో సక్సెస్, ఫెయిల్యూర్ అనే లెక్కలు అస్సలు పట్టించుకోరు. అలాగే ఒక్కసారి కథ ఒకే చెబితే హై ఎనర్జిటింగ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల తమదైన శైలిలో ఆకట్టుకుంటారు. ఈ సారి కూడా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లతోనే ఈ ఇద్దరు హీరోలు థియేటర్స్ లోకి రాబోతున్నారు. మరి వీరిద్దరూ చేస్తున్న సినిమాలలో ఏది సక్సెస్ అందుకుంటుందనేది చూడాలి.

Tags:    

Similar News