టైగర్ నాగేశ్వరరావు.. రేణు దేశాయ్ క్యారెక్టర్ అసలు కథ!
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ గా రాబోతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు.
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ గా రాబోతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.
తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ భారీగానే ఖర్చు చేసింది. పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అవుతుందని నమ్మకంతో కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా ఒక స్పెషల్ బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నుపూర్ సనోన్ నటించిన విషయం తెలిసిందే.
ఇక సీనియర్ నటిమని రేణు దేశాయ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ను కూడా నేడు విడుదల చేశారు. ఇందులో రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఒక చంటి పాపను తన ఒడిలో పెట్టుకుని ఉన్న స్టీల్ను ఈ పోస్టర్ లో హైలెట్ చేశారు. అయితే ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన అనేక రకాల అంశాల్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
టైగర్ నాగేశ్వరరావు నిజజీవితంలో అయితే హేమలత లవణం అనే పాత్ర నిజంగానే ఉంది. నాస్తిక సమాజానికి చెందిన కొందరు అప్పట్లో స్టువర్టుపురం దొంగలలో మార్పు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక అందులో హేమలత లవణం కూడా ఆమె భర్తతో కలిసి వారిని మంచి దారిలో పెట్టారు. అయితే టైగర్ నాగేశ్వరరావు కూడా ఆమె మార్చడానికి ప్రయత్నాలు చేశారు.
అదే పాత్రలో ఆమె ఇప్పుడు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే నిజానికి టైగర్ నాగేశ్వరరావు, హేమలత లవణం మాట మొదట విన్నప్పటికీ ఆ తర్వాత అయితే వినకుండా మళ్ళీ దొంగ గానే కొనసాగాడు. అనంతరం పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. మరి ఈ సినిమాలో హేమలత లవణం పాత్రను అలాగే చూపిస్తారా? లేదంటే మరొక కోణంలో చూపిస్తారా అనేది విడుదల తర్వాత తెలుస్తుంది. అలాగే ఈ సినిమాతో రేణు దేశాయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.