రీరిలీజ్.. బోర్ కొట్టేసింది బాబు?

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/G బృందావన్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రస్తుతం రీరిలీజ్ కి సిద్ధం చేశారు.

Update: 2023-09-22 04:09 GMT

టాలీవుడ్ లో గత కొంతకాలం నుంచి రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలని 4కెలోకి మార్చి థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. పోకిరి మూవీతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ రీరిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమని రీరిలీజ్ చేశారు. అలాగే ఖుషి మూవీ కూడా రీరిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించింది.

స్టార్ హీరోల చిత్రాలకి మంచి ఆదరణ వస్తూ ఉండటంతో అభిమానులు స్పెషల్ షోలుగా వాటిని రీరిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సింహాద్రి, ఆరెంజ్ సినిమాల వరకు అభిమానులు ఈ క్లాసిక్ సినిమాలని బాగా ఆదరించారు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ రీరిలీజ్ చేయగా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ ఎంత వచ్చాయనేది కూడా ప్రకటించలేదు.

సూర్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీని తెలుగులో రీరిలీజ్ చేస్తే అద్భుతమైన ఆదరణ లభించింది. దీంతో డబ్బింగ్ మూవీస్ కూడా కల్ట్ ఇమేజ్ ఉంటే ప్రేక్షకాదరణ వస్తుందని భావించి పరభాషా చిత్రాలు మళ్ళీ థియేటర్స్ లోకి వదులుతున్నారు. బాలకృష్ణ భైరవద్వీపం సినిమా రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే పెద్దగా స్పందన లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 7/G బృందావన్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రస్తుతం రీరిలీజ్ కి సిద్ధం చేశారు. డీసెంట్ బుకింగ్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి వచ్చే ఆదరణ బట్టి ఈ ట్రెండ్ పై ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఉన్నారనేది పూర్తిగా తెలిసిపోతుంది. కల్ట్ క్లాసిక్ గా ఇప్పటికి నిలిచిపోయే ఈ చిత్రాన్ని ఇప్పటికి ఆడియన్స్ టీవీ లలో చూడటానికి ఇష్టపడతారు.

అయితే సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ఎంత వరకు టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్లి చూస్తారనేది తెలియాల్సి ఉంది. రవికృష్ణ, సీనియర్ అగర్వాల్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించారు. సినిమాకి వచ్చే ఆదరణ బట్టి 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. దీనికి రవికృష్ణ కూడా సిద్ధం అవుతున్నారు.

Tags:    

Similar News