'వ్యూహం' మూవీ సర్టిఫికెట్ తో ఆర్జీవీ
ఎట్టకేలకు సంచలనాల రాంగోపాల్ వర్మ సాధించాడు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అన్నింటిని తట్టు కుని చివరికి తాను అనుకున్నది చేధించాడు
ఎట్టకేలకు సంచలనాల రాంగోపాల్ వర్మ సాధించాడు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అన్నింటిని తట్టు కుని చివరికి తాను అనుకున్నది చేధించాడు. ఎన్నికల ముందు అనుకున్నట్లుగానే 'వ్యూహం' చిత్రం రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేసాడు. ఇప్పుడా మాటకు కట్టుబడి సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా 'వ్యూహం' సెన్సార్ పూర్తిచేసుకుని రూట్ క్లియర్ చేసుకున్నాడు. కొద్ది సేపటి క్రితమే సోషల్ మీడియాలో వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకునిఓ ఫోటో దిగి దాన్ని ట్విటర్లో పోస్ట్ చేసి తన మాట నెగ్గించుకున్నాడు.
ఓ చేతితో సెన్సార్ సర్టిఫికెట్ పట్టుకుని మరో చేతిలో గన్ గురి పెట్టి ఇదిగో వస్తున్నాని కాస్కో? అని ప్రత్యర్ధులకు సవాల్ విసిరాడు.' పట్టు వదలని విక్రమార్క్ ని' అంటూ తనని తాను పొగుడేసుకుని వ్యూహం ఇన్ థియేటర్స్ మార్చి 2 రెండు అంటూ మజిల్ ఉన్న ఎమోజీని పోస్ట్ చేసి తానెంత బలవంతుడో నిరూపించాడు. సీబీఎఫ్ సీ హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ షిపాలీ కుమార్ సంతకంతో కూడిన సర్టిఫికెట్ గమనించొచ్చు.
ఇక సినిమాకి ఎలాంటి కట్లు లేకుండా U/A వచ్చింది. ఎవరైనా ఈ సినిమాని చూడొచ్చు. కాకపోతే 12 ఏళ్ల లోపు పిల్లలు పెద్దలతో కలిసి చూడటం అనే ఒక నిబంధన తప్ప ఇంకే లేదు. హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు..నగ్నత్వానికి కొంతవరకూ ఛాన్స్ ఉంటుంది. 'వ్యూహం' అనేది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమన్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల నేపథ్యంలో హైదరాబాద్ లో సెన్సార్ కష్టమని భావించిన వర్మ కర్ణాటక నుంచి సెన్సార్ తెచ్చుకుని రిలీజ్ చేయాలని చూసారు.
కానీ అదే సమయంలో నారా లోకేష్ రిలీజ్ ని అడ్డుకుంటూ హైదరాబాద్ కోర్టులో కేసు వేసాడు. ఆ తర్వాత రిలీజ్ విషయంలో కొంత స్తబ్ధత నెలకొంది. ఎన్నికల ముందు రిలీజ్ అవుతుందా? లేదా? అన్న సందే హం కూడా తెరపైకి వచ్చింది. కానీ చివరికి హైదరాబాద్ రీజనల్ ఆపీస్ నుంచే సెన్సార్ పూర్తి చేసుకోవడం...రిలీజ్ కి రెడీ అవ్వడంతో వర్మ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. రిలీజ్ కి ఇంకా రెండు. .మూడు రోజులే సమయం ఉంది. మరి ఈలోగా లోకేష్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.