బెయిల్ రాగానే నాగిని డ్యాన్స్ ఆడిందిట‌

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఇటీవల జైలు జీవితం నుండి బయటపడిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-01-15 05:24 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఇటీవల జైలు జీవితం నుండి బయటపడిన సంగ‌తి తెలిసిందే. నెల‌రోజుల పాటు జైలు శిక్ష‌ను అనుభ‌వించిన ఈ వివాదాస్ప‌ద న‌టి త‌న జైలు అనుభవం గురించి మాట్లాడింది. జైలులో ఉన్న కాలంలో అక్క‌డ తిండిని మ్యానేజ్ చేయ‌డం .. అప‌రిశుభ్ర‌మైన బాత్రూమ్ తో.. పరిమిత భత్యంతో జీవితాన్ని కొన‌సాగించ‌డం స‌హా తాను ఎదుర్కొన్న కష్టాలను నిజాయితీగా వెల్ల‌డించింది. జైలులో సవాళ్ల‌తో కూడిన జీవితం గురించి ప్ర‌తిదీ ఓపెనైంది. అంతే కాదు ఈ అనుభ‌వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

చేతన్ భగత్‌తో చాట్ షో, దీప్‌టాక్ విత్ చేతన్ భ‌గ‌త్ లో రియా మాట్లాడుతూ-``COVID నిబంధనల కారణంగా నేను 14 రోజుల పాటు ఏకాంత నిర్బంధంలో ఉండవలసి వచ్చింది. గదిలో నేను ఒక్కదానినే ఉన్నాను. భోజనం చేయాలనుకుంటున్నారా? అని అధికారులు నన్ను అడిగారు. నేను చాలా ఆకలితో ఉన్నాను.. చాలా అలసిపోయాను.. నాకు ఏమి ఇస్తే అది తిన్నాను. మెనూలో రోటీ - క్యాప్సికమ్ ఉన్నాయి``అని వెల్లడించింది. నీటిలో ఉడికించిన‌ క్యాప్సికం మాత్రమేన‌ని తెలిపింది.

తన తోటి ఖైదీలతో సానుకూలంగా ఉండటానికి ప్ర‌య‌త్నించ‌డ‌మే గాక‌.. ఆ స‌మ‌యంలో తన మూలాన్ని కనుగొన్నట్లు రియా తెలిపింది. చాలా మంది ఖైదీలకు కుటుంబ సపోర్టు లేక‌పోవ‌డం చూసినప్పుడు నేను చాలా కృతజ్ఞతతో ఉండడం మొదలుపెట్టాను. బెయిల్ వ‌చ్చినా వారి వద్ద రూ. 5,000 లేదా రూ10,000 లేక‌పోవ‌డం వ‌ల్ల బ‌య‌ట‌కు వెళ్ల‌లేక‌పోయేవారు. కనీసం నాకు నా కుటుంబం, స్నేహితులు ఉన్నారు.. అని తెలిపింది. ``నాకు న్యాయం జరుగుతుంది. బెయిల్ వస్తుంది. నేను ఏ తప్పూ చేయలేదు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ మహిళ(ఖైదీ)ల నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. నా నియంత్రణలో లేని వాటి గురించి నేను ఎందుకు సమయం వృధా చేస్తున్నాను?`` అని ఆలోచించాన‌ని తెలిపింది.

జైళ్లలో టాయిలెట్ సౌకర్యాల గురించి రియా ప్ర‌స్థావించింది. జైలులో ఉండటం చాలా కష్టతరమైన అంశాల‌లో టాయ్ లెట్ ఒకటి.. జైలులో టాయ్ లెట్ అంత ప‌రిశుభ్ర‌త‌తో ఉండ‌ద‌ని రియా నాటి అనుభ‌వాన్ని గుర్తుచేసుకుంది. ఖైదీగా మానసిక గాయం చాలా కష్టంగా ఉంటుంది.. దానికి అద‌నంగా శారీరక గాయం ప్రారంభమవుతుంది. ``గండా బాత్రూమ్ తో కర్ లుంగీని నిర్వహించాలి`` అని కూడా అంది. జైలులో క్యాంటీన్ ఉందని, ఖైదీలు తమ ఇళ్ల నుంచి మనీ ఆర్డర్ తీసుకునేందుకు అనుమతి ఉందని ఆమె వెల్లడించారు. రియాకు మనీ ఆర్డర్ రూ. నెలకు 5,000. ఆహారం తినే స‌మ‌యం, పడుకునే సమయాలలో బ్రిటీషర్లు వదిలివేసిన వ్యవస్థ(విభ‌జించి పాలించే)ను జైలు కూడా అనుసరిస్తుందని రియా తెలిపారు.

ఖైదీల‌కు ఉదయం 6 గంటలకు అల్పాహారం, 11 గంటలకు భోజనం, మధ్యాహ్నం 2 గంటలకే రాత్రి భోజనం అందించేస్తారు. ఎందుకంటే ఇది బ్రిటీష్ విషయాలకు అనుగుణంగా ఉంటుంది. వారు ఉదయం 6 గంటలకు గేట్లు తెరిచి, సాయంత్రం 5 గంటలకు అంద‌రినీ లాక్ చేస్తారు. అప్పటి వరకు స్నానం చేయవచ్చు.. లైబ్రరీకి వెళ్లవచ్చు.. ఇత‌ర ప‌నులు పూర్తి చేయొచ్చు. చాలా మంది తమ డిన్నర్‌ను సేవ్ చేసి 7-8 గంటలకు తింటారు. అయితే నేను నా మొత్తం కాల‌ చక్రం మార్చాను. ``యే ఖానా తో వైసే భీ ఖయా నహిం జాయేగా. గరం హోగా తో ఫిర్ భీ ఖయా జాయేగా. తండా తో బిల్కుల్ నహిం ఖయా జాయేగా``. అందుకే నేను తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొన్నాను. మధ్యాహ్నం 2 గంటలకు నా రాత్రి భోజనం ముగించేదానిని అని తెలిపింది.

సెప్టెంబర్ 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్ర‌గ్స్ కోణంలో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. జూన్ 2020లో సుశాంత్ సింగ్ త‌న‌ ముంబై అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో చనిపోయాడు. ఆ మరణం నాటికి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. బెయిల్ మంజూరు చేయడానికి ముందు రియా 28 రోజుల జైలు శిక్షను అనుభ‌వించింది.

Tags:    

Similar News