నేను పొరుగు భాష‌ల్లో న‌టించే టైప్ కాదు!

న‌టుడు-దర్శకుడు రిషబ్ శెట్టి ఇటీవలే కాంతార 2 ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. కాంతార లెజెండ్: అధ్యాయం 1 పేరుతో `కాంతార` ప్రీక్వెల్ క‌థను తెర‌పై చూపిస్తామ‌ని తెలిపారు.

Update: 2023-11-30 04:27 GMT

న‌టుడు-దర్శకుడు రిషబ్ శెట్టి ఇటీవలే కాంతార 2 ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. కాంతార లెజెండ్: అధ్యాయం 1 పేరుతో `కాంతార` ప్రీక్వెల్ క‌థను తెర‌పై చూపిస్తామ‌ని తెలిపారు. ఇటీవల రిషబ్ శెట్టి కన్నడ ప్రేక్షకులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ‌జేశాడు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో రిషబ్ శెట్టి పరిశ్రమలో త‌న ధృక్ప‌థం ఆలోచ‌న‌ల‌ గురించి వెల్లడించారు

కాంతార విజ‌యం త‌ర్వాత తనకు ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినట్లు వెల్లడించారు. ఇరుగు పొరుగు భాష‌ల నుంచి అతని వద్దకు వస్తున్నారు. త‌ను వారికి పెద్ద అభిమాని కూడా. పెద్ద స్టార్స్‌తో నటించే అవకాశాలు కూడా వచ్చాయని తెలిపారు. అయితే మాతృభాష‌ కన్నడలో మాత్రమే చేయాలని ఉందని రిషబ్ చెప్పాడు. కన్నడ ప్రేక్షకులే ముందుగా త‌న‌ను గుర్తించి, ఆదరించినట్లు తెలిపారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాన‌ని అన్నారు.

నేను ఇతర భాషలను ఇతర పరిశ్రమలను చూసే వ్యక్తిని కాదని రిష‌బ్ అన్నారు. ఏది చేసినా కన్నడలో చేస్తానని చెప్పాడు. కాకపోతే దానిని ప్రపంచవ్యాప్తం చేస్తాన‌ని అన్నాడు. కన్నడలో తీసినా.. డబ్బింగ్ చెప్పినా ఎమోషన్‌ మారకుండా చూసుకుంటానని చెప్పారు. సినిమాకి అందరూ కనెక్ట్ అవ్వాలని అన్నారు.

కాంతార ప్రీక్వెల్ ఫస్ట్ లుక్ రహస్యం చీకటి మేళ‌వింపుగా ఉంది. రిషబ్ లైట్ వైపు చూస్తున్నప్పుడు సర్కిల్ మధ్యలో నిలబడి కనిపించాడు. వీడియో మొదటి సినిమాలో వినిపించిన నిగూఢ‌మైన సుపరిచితమైన గర్జనతో ప్రారంభమవుతుంది. కాంతర లెజెండ్ చాప్టర్ 1 కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ, హిందీ, బంగ్లా, ఇంగ్లీషు సహా ఏడు భాషలలో విడుదలవుతుంది. విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News