ఆడ‌పిల్ల‌ల్ని ఏడిపించ‌కుండా ఉంటే హ్యాపీగా ఉంటారు: నాగ చైత‌న్య‌!

యువ సామ్రాట్ నాగ చైత‌న్య హీరోగా లేడీ సూప‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా తెర‌కెక్కిన తండేల్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో హీరోయిన్లు ఒక‌రినొక‌రు ఇంట‌ర్వ్యూ చేశారు

Update: 2025-02-06 13:01 GMT

యువ సామ్రాట్ నాగ చైత‌న్య హీరోగా లేడీ సూప‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా తెర‌కెక్కిన తండేల్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో హీరోయిన్లు ఒక‌రినొక‌రు ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ నేప‌థ్యంలో నాగ చైత‌న్య‌ను సాయి ప‌ల్ల‌వి కొన్ని క్రేజీ క్వ‌శ్చ‌న్స్ అడిగింది. తండేల్ సినిమా ఎందుకు నీకు స్పెష‌ల్? ఇంత‌కు ముందెప్పుడూ లేని విధంగా ఈ సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నావు అని అడిగితే ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని, ఇదొక నిజ‌మైన క‌థ కావ‌డంతో ఇందులో డెప్త్ ఉంద‌ని, అన్నింటికంటే త‌న‌కు హిట్ క్రేవింగ్ ఉందని ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని అందుకే తండేల్ ను ఇంత‌గా ప్ర‌మోట్ చేస్తున్నాన‌ని చైత‌న్య చెప్పాడు.

ఈ సంద‌ర్భంగా చైత‌న్యను బాయ్స్ స్కిన్ కేర్ టిప్స్ చెప్ప‌మ‌ని అడిగిన ఓ అభిమాని ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ అవ‌న్నీ ఎందుకు హ్యాపీగా ఉండండి బ్ర‌ద‌ర్, ఆడపిల్ల‌ల్ని ఏడిపించ‌కుండా ఉంటే ఆటోమేటిక్ గా హ్యాపీగా ఉంటార‌న్నాడు చైత‌న్య‌. యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావ‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఎప్పుడేంటి న‌టుడ‌నేవాడు ఎప్ప‌టిక‌ప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవ‌డం ఆపేస్తే న‌టుడిగా అక్క‌డే ఉండిపోతాం. నెక్ట్స్ లెవెల్ కు వెళ్ల‌లేమ‌ని తెలిపాడు.

తండేల్ షూటింగ్ లో మోస్ట్ మెమొర‌బుల్ సంఘ‌ట‌న ఏంట‌నే ప్ర‌శ్న‌కు చైతూ స‌మాధాన‌మిచ్చాడు. కేర‌ళ‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు కేర‌ళ నేవీ టీమ్ వ‌చ్చి చాలా సేపు త‌మ‌ని ఇన్వెస్టిగేట్ చేసింద‌ని, సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ స‌ర్ ను వారి ఆఫీసుకి కూడా తీసుకెళ్లార‌ని, అదంతా చాలా డ్ర‌మెటిక్ గా జ‌రిగింద‌ని చెప్పాడు. ఇక నెగిటివ్ రోల్ ఎప్పుడు చేస్తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు సాయి ప‌ల్ల‌వి సినిమా డైరెక్ట్ చేసిన‌ప్పుడు చేస్తాన‌ని స‌మాధాన‌మిచ్చాడు చైత‌న్య‌.

ఇప్ప‌టివ‌ర‌కు కెరీర్లో ఛాలెంజింగ్ డైలాగ్ ఏద‌ని అడిగితే, తండేల్ లో శ్రీకాకుళం యాస లో ఓ డైలాగ్ ఉంటుంద‌ని, యాస, భాష గురించి చెప్పే సీన్ లో భాగంగా ఆ డైలాగ్ వ‌స్తుంద‌ని, ఆ డైలాగ్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్పాడు. ఎలాంటి బ్యాడ్ వ‌ర్డ్స్ మాట్లాడ‌తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు నేన‌స‌లు బ్యాడ్ వ‌ర్డ్స్ మాట్లాడ‌న‌ని అన్నాడు. దానికి వెంట‌నే అంతా అబ‌ద్దం. నాకు తెలుసు నువ్వు మాట్లాడ‌తావ‌ని సాయి ప‌ల్ల‌వి అంది.

లైఫ్ లో మీరు కొనాల‌నుకుంటున్న డ్రీమ్ కార్ ఏంట‌ని అడ‌గ్గా కోనిక్ జెగ్ అని చెప్పాడు. దానికి సాయి ప‌ల్ల‌వి నాకు తెలియ‌దు అదేంటో నేను గూగుల్ చేయాల‌ని స‌ర‌దాగా అంది. ఇక లైఫ్ లో ఎలాంటి భ‌యాన్ని పోగొట్టుకోవాల‌నుకుంటున్నార‌నే ప్ర‌శ్న‌కు చైతూ స‌మాధాన‌మిస్తూ ముందు డ్యాన్స్ అని వెంట‌నే న‌వ్వి ఇప్పుడు డ్యాన్స్ మీద భ‌యం పోయిన‌ట్టు చెప్పాడు. తాను బేసిక్ గా ఇంట్రోవర్ట్ అని, ఇప్పుడు సోష‌లైజ్ అవాల‌నుకుంటున్న‌ట్టు తెలిపాడు.

రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ ను ఏ క్యారెక్ట‌ర్ తో స్వాప్ చేస్తార‌నగానే, స్వాప్ చేయ‌డ‌మంటే ఇప్పుడే కాదు కానీ సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకునే టైమ్ లో అయితే ప్రేమ‌మ్ లో థ‌ర్డ్ క్యారెక్ట‌ర్ అయిన చెఫ్ క్యారెక్ట‌ర్ అని వెల్ల‌డించాడు. తండేల్ మూవీ ఓవ‌ర్సీస్ ప్రింట్ చూశాక ఎలా అనిపించింద‌ని ఆఖ‌రిగా సాయి ప‌ల్ల‌వి అడ‌గ్గా, సినిమా మంచి సంతృప్తినిచ్చింద‌ని, క్లైమాక్స్ చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇంత బాగా వ‌స్తుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేయ‌లేద‌ని చెప్పుకొచ్చాడు నాగ చైత‌న్య‌.

Tags:    

Similar News