దేవర.. భైరా క్లిక్కయితే బీభత్సమే..

ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ ఇద్దరూ కూడా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ అందుకున్న స్టార్స్.

Update: 2024-08-16 07:45 GMT

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ "దేవర"పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. దర్శకుడు కొరటాల శివ కూడా "ఆచార్య" తర్వాత చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.


జూనియర్ ఎన్టీఆర్ కూడా "RRR" సినిమాతో విదేశాల్లో మంచి క్రేజ్ అందుకున్నాడు కాబట్టి, ఈ సినిమాతో తన క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్లాలని ఆశపడుతున్నాడు. ఈ సినిమాకు సౌత్‌లో మంచి హైప్ ఉన్నప్పటికీ, మేకర్స్ అన్ని వైపుల నుంచి వీలైనంత ఎక్కువ స్థాయిలో ప్రమోషన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా ప్రత్యేకమైన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ ఇద్దరూ కూడా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ అందుకున్న స్టార్స్. కాబట్టి వారి సైడ్ నుంచి సినిమాకు మరింత క్రేజ్ పెరిగేలా చూస్తున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

దానికి సంబంధించి న్యూస్ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కరెక్ట్‌గా ఈరోజు సాయంత్రం 4:05కి గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. ఇది ఏమాత్రం క్లిక్ అయినా కూడా బాలీవుడ్‌లో సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అవుతుంది అని చెప్పవచ్చు. సైఫ్ విలన్ రోల్స్ అద్భుతంగా చేయగలడు అనేది ఇంతకుముందే నిరూపించాడు.

కాబట్టి "దేవర" సినిమాలో అతను చేస్తున్న భైరా పాత్ర కూడా అంతకుమించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇంతకుముందే విడుదల చేసిన పోస్టర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కాబట్టి రాబోయే గ్లింప్స్ కూడా అదే తరహాలో రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. నార్త్‌లో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగిందనే తెలుస్తోంది. సినిమా సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరో నెల తర్వాత సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారు

Tags:    

Similar News