సైంధవ్ మొదటి రోజు కలెక్షన్స్.. మైండ్ బ్లాక్

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సైంధవ్

Update: 2024-01-14 18:42 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సైంధవ్. వెంకటేష్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కింది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే వెంకటేష్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ యాక్షన్ మూవీ రావడంతో విక్టరీ అభిమానులు సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

జనవరి 13న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బిలో ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై 25 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో 26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి రోజు మూవీ కేవలం 5.45 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అందులో 3.03 కోట్ల షేర్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో 2.38 కోట్ల షేర్ ని ఈ మూవీ అందుకుందని తెలుస్తోంది.

కర్ణాటకలో 20 లక్షల షేర్ ని వసూళ్లు చేసింది. ఓవర్సీస్ లో 45 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని సాధించాలంటే 22.97 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమాకి అయితే మిశ్రమ స్పందన వస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అయిన కూడా థియేటర్స్ ఆశించిన స్థాయిలో దొరకలేదు. దానికి తగ్గట్లుగా రెస్పాన్స్ కూడా ఎవరేజ్ గా ఉండటంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోలేకపోయింది.

హనుమాన్ సినిమా హిట్ టాక్ వచ్చింది. అలాగే గుంటూరు కారం సినిమాకి మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది. నా సామి రంగ సినిమాకి పర్వాలేదనే టాక్ వస్తోంది. ఇంత కాంపిటేషన్ మధ్యలో సైంధవ్ మూవీ టార్గెట్ ని ఎంత వరకు రీచ్ అవ్వగలదు అనేది తెలియాల్సి ఉంటుంది. పేరుకే పాన్ ఇండియా బ్రాండ్ ఉన్న ఒక్క తెలుగు తప్ప మిగిలిన భాషలలో పెద్దగా ప్రభావం చూపించడం లేదు.

ఈ సినిమాతో నవాజుద్ధీన్ సిద్దీఖ్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అతని పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆయన ఈ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. శ్రద్ధా శ్రీనాథ్ మూవీలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆమె వెంకటేష్ భార్య పాత్రలో నటించలేదని టాక్.

మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ (షేర్)

ఏపీ తెలంగాణ మొత్తం:- 2.38కోట్లు

కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.20 కోట్లు

ఓవర్సీస్: 0.45 కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్:- 3.03 కోట్లు

బ్రేక్ ఈవెన్ - 26 కోట్లు

Tags:    

Similar News