సలార్ - యానిమాల్ - హాయ్ నాన్న.. వ్వాటే లింక్!
తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో మోస్ట్ వైలెంట్ ఎమోషనల్ యాక్షన్ మూవీగా యానిమల్ ఉండబోతుందని అర్థమవుతుంది.
ఈ ఏడాది డిసెంబర్లో భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. డిసెంబర్ 1న రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో మోస్ట్ వైలెంట్ ఎమోషనల్ యాక్షన్ మూవీగా యానిమల్ ఉండబోతుందని అర్థమవుతుంది.
కో ఇన్సిడెంట్ గా డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ కూడా ఇంచుమించు ఇలాంటి లైన్ అప్ లోనే ఉండబోతుంది. అయితే ఈ చిత్రాన్ని పీరియాడికల్ యాక్షన్ మూవీగా ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇందులో కూడా తండ్రి కొడుకుల రిలేషన్ షిప్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాచురల్ స్టార్ నాని హీరోగా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతున్న హాయ్ నాన్న మూవీ కూడా తండ్రి సెంటిమెంట్ తోనే ఉండబోతుంది. అయితే ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య సున్నితమైన ఎమోషనల్ జర్నీని దర్శకుడు శౌర్యువ్ ఆవిష్కరించినట్లుగా టీజర్ బట్టి అర్థమవుతుంది. ఈ మూడు సినిమాలు కామన్ పాయింట్ ఫాదర్ ఎమోషన్ కావడం విశేషం.
ఒకే నెలలో ఒకే తరహాలో ఉండే ఎలిమెంట్ తో సినిమాలు రావడం నిజంగా విశేషమైన చెప్పాలి. ఈ మూడు సినిమాలకు మంచి బజ్ కూడా ఉంది. భారీ ఓపెనింగ్స్ కూడా రావడం గ్యారెంటీ. మరి దర్శకులు ఆయా సినిమాల కథాంశంతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారు అనేదాన్ని బట్టి వాటి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలపై ఆడియన్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉండడం గమనార్హం.
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి యానిమల్ మూవీ తెలుగులో వస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో మరో సూపర్ హిట్ కొట్టడానికి రాబోతున్నారు. దసరా లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత నాచురల్ స్టార్ నాని కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో హాయ్ నాన్నతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో సక్సెస్ ఎవరిని అందుకుంటుందనేది వేచి చూడాలి.