సలార్ రేటు తగ్గిందా?
ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ కొన్ని ప్రాంతాలలో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సలార్ సిరీస్ లో మొదటి పార్ట్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై హైఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఆ అంచనాలు పెరిగిపోయాయి.
అలాగే డార్లింగ్ ప్రభాస్ కి బాహుబలి 2 తర్వాత సాలిడ్ హిట్ ఇప్పటి వరకు పడలేదు. సలార్ తో ఆ కోరిక తీరిపోతుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. శృతి హాసన్ ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది. సలార్ తర్వాత ఇప్పటి వరకు ఆమె నుంచి ఒక్క సినిమా కూడా ఎనౌన్స్ కాలేదు. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్స్ గా కనిపించబోతున్నారు.
పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథలతో పాటు బలమైన ఎమోషన్స్ ని ప్రశాంత్ నీల్ తన సినిమాలతో పండిస్తూ ఉంటారు. సలార్ లో కూడా అలాంటి బలమైన ఎమోషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ కొన్ని ప్రాంతాలలో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
నిజానికి డిజిటల్ రైట్స్ ద్వారా 200 కోట్ల వరకు వస్తాయని నిర్మాత ఆశించారు. అయితే ఫైనల్ గా 160 కోట్లకి నెట్ ఫ్లిక్స్ వారితో డీల్ ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. 160 కోట్లు అయిన కూడా ఓ విధంగా పెద్ద మొత్తమనే చెప్పాలి. ఆదిపురుష్ మూవీ ఎఫెక్ట్ సలార్ డిజిటల్ రైట్స్ మీద పడిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
కచ్చితంగా సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ మార్కెట్ పుంజుకునే ఛాన్స్ ఉంది. లేదంటే ఆ ప్రభావం కల్కి మూవీపైన కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ రెడీ అవుతోంది. మరి సలార్ ఆ సినిమాకి ఎంత వరకు సపోర్ట్ గా నిలుస్తుందనేది చూడాలి.