సలార్.. మొత్తం ఎన్ని ఫైట్స్ అంటే!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెన్సార్ పనులను కూడా ఇటీవల ముగించుకుంది

Update: 2023-12-15 10:36 GMT

పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న ప్రభాస్ ఈసారి సలార్ తో ఎలాగైనా సాలీడ్ సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడని ప్రభాస్ వరుసగా సాహో రాదేశామ్ ఆదిపురుష్ సినిమాలతో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సలార్ మొదటి రోజే ఊహించని స్థాయిలో 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని అభిమానులు అయితే చాలా నమ్మకంతో ఉన్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెన్సార్ పనులను కూడా ఇటీవల ముగించుకుంది. ఇక ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సలార్ మొదటి రోజు మాత్రం తప్పకుండా ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసేలా కలెక్షన్స్ అయితే వస్తాయని అనిపిస్తుంది. ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ అంత దూకుడుగా కనిపించకపోయినప్పటికీ ప్రభాస్ ప్రశాంత్ కాంబినేషన్ ద్వారానే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ కూడా ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు సమాచారం. కేజిఎఫ్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఎంత ఆసక్తిగా డిజైన్ చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఫైట్ కి ముందు ఒక స్టోరీ ఎలివేషన్ ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.

ఇక ఈసారి సలార్ సినిమాలో కూడా అదే తరహాలో హీరో ఇమేజ్కు తగ్గట్టుగా ఫైట్స్ ను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ లో రెండు ఫైట్లు ఒకదానికి మించి మరొకటి ఉంటాయట. ఇక సెకండ్ హాఫ్ లో అంతకుమించి అనేలా మూడు ఫైట్లు ఉంటాయి అని తెలుస్తోంది. అంటే సినిమాలో మొత్తం 5 ఫైట్లు ఉంటాయని తెలుస్తోంది. ఎక్కడా కూడా ఎమోషన్ ని పక్కదారి పట్టించకుండా ఈ ఆక్షన్ బ్లాక్స్ ను సెట్ చేసినట్లు సమాచారం.

కథలో అంతర్లీనంగా ఉండే ఫైట్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తాయని కూడా చిత్ర యూనిట్ నుంచి ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక సెన్సార్ యూనిట్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రియాక్షన్స్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరి సలార్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Tags:    

Similar News