'డంకీ'.. 'సలార్' కి ఇదే మంచి ఛాన్స్!
షారుఖ్ ఖాన్ 'డంకీ', ప్రభాస్ 'సలార్'.. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నెలకొన్న విషయం తెలిసిందే
షారుఖ్ ఖాన్ 'డంకీ', ప్రభాస్ 'సలార్'.. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ నెలకొన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆడియన్స్ లో ఈ సినిమాలపై నెలకొన్న హైప్ అంతా ఇంతా కాదు. పఠాన్, జవాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ అందుకున్న షారుక్ డంకీతో ప్రభాస్ కి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ కంటే ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటాడని షారుక్ ఖాన్ ఫ్యాన్స్, సలార్ కింద 'డం'కీ ఏమాత్రం పనిచేయదని ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట తెగ రచ్చ చేశారు.
షారుక్ కి వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే కదా. దానికి తోడు ఈ సినిమాని బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించారు. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఆయనకి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే సలార్ పై డంకీ ప్రభావం ఎలా ఉంటుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ లో చిన్న టెన్షన్ ఉండింది. ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డంకీ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది.
'డంకీ' మూవీలో ఉన్న ఎమోషన్ క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సలార్ మూవీని ఎక్కడ డామినేట్ చేస్తుందో అన్న టెన్షన్ నిన్నటి వరకు అటు సలార్ బయ్యర్స్ కి ఎక్కువగానే ఉంది. కానీ డంకీ మూవీ టాక్ అటు ఇటుగా ఉండడంతో సలార్ పై చేయి సాధించే ఛాన్స్ ఉంది. బాక్సాఫీస్ వద్ద సలార్ దున్నుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. మరోవైపు సలార్ కి డంకీ ఏమాత్రం పోటీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని, పైగా రాజ్ కుమార్ హిరాని గత చిత్రాలతో పోల్చితే ఇది అంత గొప్ప సినిమా కాదని తేల్చేస్తున్నారు. సినిమాలో షారుక్ పర్ఫామెన్స్ బాగున్నా ఎమోషన్ పెద్దగా కనెక్ట్ కాకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని అంటున్నారు. హ్యాట్రిక్ కొట్టాలనుకున్న షారుఖ్ ఖాన్ ఆశలు ఫలించలేదు.
ప్రస్తుతం సలార్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా బాక్సాఫీస్ వద్ద డైనోసార్ దెబ్బకి డంకీ కొట్టుకుపోవడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు సలార్ లాంటి మాస్ మూవీకి పోటీగా డంకీ లాంటి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ మూవీని దించడం కరెక్ట్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రేపు సలార్ రంగంలోకి దిగబోతోంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్.