సలార్‌ VS డంకీ : భయపెడుతున్న 'జీరో' సెంటిమెంట్‌

ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించగల సత్తా ఉన్న సినిమాలు అనడంలో సందేహం లేదు.

Update: 2023-12-13 08:43 GMT

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద వార్‌ కి మరో వారం రోజుల్లో తెర లేవనున్న విషయం తెల్సిందే. సలార్‌ మరియు డంకీ సినిమాలు క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించగల సత్తా ఉన్న సినిమాలు అనడంలో సందేహం లేదు. కానీ పోటీ వల్ల కచ్చితంగా డ్యామేజీ తప్పదు అంటున్నారు.

ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ రూపొందించిన సలార్‌ సినిమా ప్రీ రిలీజ్ బజ్ విషయంలో డంకీ పై పైచేయి సాధించినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమా ట్రైలర్‌ కి వచ్చిన రెస్పాన్స్ మరియు సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ ఇలా అన్ని విషయాల్లో కూడా డంకీ పై సలార్ పై చేయి సాధించినట్లుగానే కనిపిస్తోంది.

ఇదే సమయంలో డంకీ సినిమా కి ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌ భయపెడుతోంది. గతంలో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన జీరో సినిమా కేజీఎఫ్‌ కి పోటీగా వచ్చిన విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ ముందు జీరో సినిమా తేలిపోయింది. మరీ దారుణమైన ఫలితాన్ని షారుఖ్‌ జీరో సినిమా నమోదు చేసింది. అంతే కాకుండా ఆ సినిమా తో షారుఖ్ జీరో అయ్యాడంటూ చాలామంది కామెంట్స్ చేశారు.

ఇప్పుడు కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన సలార్‌ సినిమాకి షారుఖ్‌ ఖాన్‌ డంకీ సినిమా పోటీ పడబోతుంది. జీరో సెంటిమెంట్‌ రిపీట్ అయ్యి డంకీ సినిమా ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉందంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్‌ ఫ్యాన్స్ కూడా ఒకింత ఆందోళనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

సలార్‌ కి ఉన్న పాజిటివ్‌ బజ్‌ మరియు మాస్ లో ఉన్న క్రేజ్‌ నేపథ్యం లో కచ్చితంగా ఓపెనింగ్‌ కలెక్షన్స్ ఓ రేంజ్‌ లో ఉండే అవకాశం ఉంది. కనుక డంకీ సినిమా కి పాజిటివ్‌ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్‌ కలెక్షన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సలార్‌ మరియు డంకీ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News