స్టార్ హీరో బాడీ గార్డ్ 1.4కోట్ల ఖరీదైన కార్
సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా అత్యంత పెద్ద ప్యాకేజీ అందుకునే సెలబ్రిటీ రక్షకులలో ఒకడు. ఏళ్ల తరబడి సల్మాన్ వద్దనే అతడు వ్యక్తిగత అంగ రక్షకుడిగా పని చేస్తున్నాడు
సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా అత్యంత పెద్ద ప్యాకేజీ అందుకునే సెలబ్రిటీ రక్షకులలో ఒకడు. ఏళ్ల తరబడి సల్మాన్ వద్దనే అతడు వ్యక్తిగత అంగ రక్షకుడిగా పని చేస్తున్నాడు. ఒక రకంగా అతడు సల్మాన్ కుటుంబంలో భాగం. అంతేకాదు.. షేరా ఇంచుమించు సెలబ్రిటీ లైఫ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు.
ఇటీవల షేరా తన కోసం కొనుగోలు చేసిన సరికొత్త కార్ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసాడు. ఇది కొత్త రేంజ్ రోవర్. సొగసైన నల్లటి రేంజ్ రోవర్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ``సర్వశక్తిమంతుని (చేతులు ముడుచుకున్న ఎమోజీలు) ఆశీర్వాదంతో మేము ఇంట్లో కొత్త సభ్యుని (కార్ ఎమోజి) చేర్చాము`` అని రాసారు. దీనికి సల్మాన్ అభిమానులు స్పందిస్తూ షేరాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒక అభిమాని ``అభినందనలు భాయ్ (సోదరుడు)`` అని రాశారు.
మరో అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు. ``షేరా సోదరా దయచేసి నన్ను మీ అంగరక్షకుడిగా నియమించుకోండి. నేను కూడా నా కోసం క్రెటాను కొనుగోలు చేయగలను``అని రాయగా, మరొక అభిమాని `అభినందనలు` అని రాశాడు. షేరా కొనుగోలు చేసిన లగ్జరీ కారు ధర సుమారు రూ. 1.4 కోట్లు.
షేరా గురించి..
షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. 1995 నుండి సల్మాన్ కి అంగరక్షకుడు. అతడు టైగర్ సెక్యూరిటీ అనే సెక్యూరిటీ సంస్థను నిర్వహిస్తున్నాడు. 2017లో అతడు ముంబై సంగీత కచేరీలో గ్రామీ అవార్డు గెలుచుకున్న గాయకుడు జస్టిన్ బీబర్ భద్రతకు కూడా బాధ్యత వహించాడు. షేరా 19 మే1969లో ముంబై అంధేరి జన్మించాడు. అతను దామోదర్ దాస్ బర్ఫీవాలా ఉన్నత పాఠశాలలో చదివాడు. 1987లో షేరా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ముంబై జూనియర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 1988లో అతడు మిస్టర్ మహారాష్ట్ర జూనియర్‌గా రెండవ స్థానాన్ని పొందాడు. వీటికి తోడు షేరా అక్టోబర్ 2019లో రాజకీయ పార్టీ శివసేనలో చేరారు. సల్మాన్‌తో తన దీర్ఘకాల అనుబంధంపై అతను చాలా ఇంటర్వ్యూలలో ఇలా పేర్కొన్నాడు. ``జబ్ తక్ జిందా హూన్, భాయ్ కే సాథ్ రహుంగా (నేను జీవించి ఉన్నంత వరకు నేను అలాగే ఉంటాను. సల్మాన్ నా సోదరుడు) అని వ్యాఖ్యానించాడు. షేరా తన భద్రతా బృందంతో పాటు అంతర్జాతీయ పర్యటనల వేళ సల్మాన్‌తో పాటుగా వెళ్లడం విశేషం.