నటులంతా నార్సిస్టులే.. సమంత కామెంట్
సినీపరిశ్రమలో నటులంతా నార్సిస్టులేనని వ్యాఖ్యానించారు సమంత రూత్ ప్రభు.
సినీపరిశ్రమలో నటులంతా నార్సిస్టులేనని వ్యాఖ్యానించారు సమంత రూత్ ప్రభు. తనను తాను ఆరాధించుకోవడం ద్వారా తాను చాలా సమస్యల నుంచి బయటపడతానని సమంత అంగీకరించారు. మానసిక అనారోగ్యం నుంచి బయటపడేందుకు తాను ధ్యానాన్ని ఆశ్రయిస్తానని, తన తప్పుల గురించి తాను బయటకు మాట్లాడుతానని కూడా సమంత అన్నారు. నాకంటే తోపు ఎవడూ లేడు..! అంటూ తనను తాను ఆరాధించేవాడిని `నార్సిస్ట్` అని అంటారు
మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతూనే అదే సమయంలో నాగ చైతన్య నుండి విడాకులు తీసుకోవడం తన మానసిక ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావాన్ని చూపిందో బహిరంగంగా చెప్పిన సమంత రూత్ ప్రభు ధ్యానంతో అన్నిటినీ ఎదుర్కొన్నానని తెలిపారు. జీక్యూ ఇండియా ఇంటర్వ్యూలో సమంత రూత్ ప్రభు మాట్లాడుతూ- ధ్యానం తన మానసిక ఆరోగ్యాన్ని మేనేజ్ చేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడింది. పరిపూర్ణత అనే ఆలోచనను విడిచిపెట్టి, నా గురించి నేను ఆలోచించడం మొదలు పెట్టాక అన్నిటి నుంచి బయటపడ్డానని తెలిపింది. ధ్యానం మనస్సును, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.
``నేను ఓ చోట కూర్చుని సమస్య ఏంటో లోతుగా ఆలోచించి, నన్ను నేను కఠినంగా ప్రశ్నించుకుంటాను. మొదట్లో దానికి అనుగుణంగా ఉండటానికి చాలా ఒత్తిడిని అనుభవించాను. అయితే సినిమా పరిశ్రమ ఒత్తిళ్లను ఎదుర్కోవడాన్ని సులువుగా మారుస్తుంది. సగం సమయం సూట్‌కేస్ లేకుండా జీవిస్తూ, ఒక హోటల్ గది నుండి మరొక హోటల్ గదికి వెళుతుంటాం. ఇది ఒంటరితనం అనిపిస్తుంది. కానీ ఈ ఉద్యోగం మీ చెత్త అభద్రతలను, మీ అతిపెద్ద రాక్షసులను దూరం చేస్తుంది. నటులు నార్సిసిస్టిక్ (నాకంటే తోపు ఎవరూ లేరు అనుకోవడం)గా ఉంటారు. ఇది స్వీయ విధ్వంసానికి ఒక రెసిపీ`` అని సమంత అన్నారు. తెలివిగా ఉండటం అంటే ప్రతిరోజూ శ్రద్ధగా ధ్యానం చేయడమని, నిజాయితీగా ఉండేవారిని దరి చేరనివ్వడం అని సమంత అభిప్రాయపడ్డారు.