పెళ్లిలో వాస్తవికత KGF లాగా ఉంది: సమంత
సమంత రూత్ ప్రభు నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, తన తెల్లని పెళ్లి దుస్తులను నల్లని గౌనుగా మార్చుకుంది.
సమంత రూత్ ప్రభు నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, తన తెల్లని పెళ్లి దుస్తులను నల్లని గౌనుగా మార్చుకుంది. అంతేకాదు సినిమాల ద్వారా అవాస్తవిక వివాహ ఆదర్శాలను ప్రచారం చేసినందుకు కరణ్ జోహార్ పై సామ్ సరదాగా నింద వేసింది. కబీ ఖుషి కబీ ఘమ్ తరహాలో పెళ్లిళ్లను అందంగా తెరపై చూపిస్తాడని, కానీ అవి చివరకు కేజీఎఫ్ డ్రామాలా మారతాయని ఛమత్కరించింది. అందుకు సంబంధించిన ఒక పాత త్రోబ్యాక్ వీడియో ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతోంది.
2021లో భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన సమంతా రూత్ ప్రభు, తన విడాకులు ఆహ్లాదకరమైనది కాదని స్పష్టంగా పేర్కొంది. ఇటీవల కరణ్ జోహార్ షో `కాఫీ విత్ కరణ్` నుంచి సమంత క్లిప్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో సామ్ ఒక బోల్డ్ వ్యాఖ్య చేసింది. సంతోషంగా లేని వివాహాలకు కారకుడు అంటూ కరణ్‌ను నిందించింది. అతడు వివాహం ఆదర్శవంతమైనదనే భావనను, వివాహ లెహంగాలపై ఉన్న మక్కువను అంతిమ స్వప్నంలాగా తెరపై చూపించాడని సమంత హాస్యభరితంగా పేర్కొంది. కరణ్ తీసిన సినిమాలకు థాంక్స్.. అతడు పెళ్లి గురించిన అపోహకు కారణమయ్యాడని సమంత హాస్యభరితంగా పేర్కొంది.
అతడు వివాహాన్ని `కభీ ఖుషీ కభీ ఘమ్` అంత అందంగా చూపించాడు. కానీ వాస్తవికత KGF లాగా ఉంది. యాక్షన్, డ్రామా సంఘర్షణతో నిండి ఉందని సమంత అతడిని ఆటపట్టించింది. కరణ్ సినిమాలు యువతలో కొన్ని అవాస్తవ అంచనాలకు దారితీసిందని కూడా సమంత అంది.
ఇటీవల నాగ చైతన్యతో తన గతం నుండి ముందుకు సాగానని, ఆ అధ్యాయాన్ని వదిలిపెట్టే ప్రయత్నాల్లో తాను వెనుకడుగు వేయడం లేదని సమంత స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం... సమంత తన తెల్లని పెళ్లి దుస్తులను బోల్డ్ బ్లాక్ పార్టీ గౌనుగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. డిజైనర్ క్రేషా బజాజ్ అద్భుతమైన మేక్‌ఓవర్‌ను రూపొందించారు. అవార్డ్ షో కోసం సహజమైన తెల్లని వస్త్రాన్ని అద్భుతమైన బ్లాక్ సమిష్టిగా మార్చారు. డిజైనర్ షేర్ చేసిన వీడియోలో ఇది కనిపించింది. నాగ చైతన్య ఇటీవల 8 ఆగస్టు 2024న శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.