సమంత స్టన్నింగ్ వీడియోషూట్ వైరల్
సమంత పాపులర్ హార్పర్ బజార్ కవర్ పేజీ కోసం ఐదు రకాల వేరియేషన్లలో లుక్ లను ప్రదర్శించింది.
దాదాపు 3 కోట్ల (30 మిలియన్ల)కు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో సమంత (@samantharuthprabhuoffl) సోషల్ మీడియాల్లో తన అభిమానులతో చక్కని సంబంధాన్ని కలిగి ఉంది. ప్రజల దృష్టిలో యూనిక్ నెస్ కి ప్రామాణికంగా నిలిచింది. ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నప్పటికీ, తన నిజ వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే ఫాలోవర్స్‌ని కలిగి ఉండటాన్ని అదృష్టంగా భావిస్తోంది. పాపులర్ హార్పర్ బజార్ ఇండియా కవర్ పేజీపై దర్శనమిచ్చిన సమంత తాజా ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మూడు కోట్ల మందితో అనుబంధాన్ని కొనసాగించడం అంత సులువేమీ కాదని కూడా సామ్ పేర్కొంది.
సమంత మాట్లాడుతూ-``ఇదేమీ అంత సులభం కాదు. కానీ నేను సోషల్ మీడియాతో నా సంబంధంలో ఒక మధురమైన స్థానానికి చేరుకున్నాను. నిజాయితీగా ఉండటం, బలహీనతలు, బలాలు .. వీటి మధ్యలో ఉన్నవన్నీ చూపించడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. అయితే నేను చెప్పిన వాటిలో తప్పులు ఏవైనా ఉంటే మరొక వారంలో నన్ను మళ్లీ దానిపై అడగండి. నేను మరొక ట్రోలింగ్ ఫెస్ట్‌కి లక్ష్యంగా మారుతున్నాను. ఇక్కడ ఉండకూడదని నేను నా మనసు మార్చుకుని ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇది ఒక మధురమైన ప్రదేశం`` అని తెలిపింది.
సమంత పాపులర్ హార్పర్ బజార్ కవర్ పేజీ కోసం ఐదు రకాల వేరియేషన్లలో లుక్ లను ప్రదర్శించింది.
లుక్ 1: సమంతా లెదర్ యాక్సెంట్ డెనిమ్ మినీ డ్రెస్ వేసుకుంది.. లూయిస్ విట్టన్ (@louisvuitton) బ్రాండ్ కి చెందిన దుస్తులు ఇవి..
లుక్ 2: ఫాల్ వింటర్ 2023 కలెక్షన్ నుండి టల్లే నెక్లైన్తో స్లీవ్‌లెస్ బాడీసూట్, LV ఐకానిక్ బ్రాస్లెట్, అన్నీ లూయిస్ విట్టన్ (@louisvuitton) వి ఎంపిక చేసినవే ధరించింది.
లుక్ 3: ఫాల్ వింటర్ 2023 కలెక్షన్ నుండి మాస్కులిన్ బ్లేజర్ -స్ట్రెయిట్ లెదర్ ప్యాంటు, పెటిట్ మల్లె బ్యాగ్ - బ్లూమింగ్ చెవిపోగులు, అన్నీ లూయిస్ విట్టన్ (@louisvuitton) వే
లుక్ 4: ఫాల్ వింటర్ 2023 కలెక్షన్, లూయిస్ విట్టన్ (@louisvuitton) నుండి రౌండ్ షోల్డర్ ట్యూబ్ డ్రెస్
లుక్ 5: బబుల్ డామియర్ ట్రక్కర్ జాకెట్, ఫ్లాక్డ్ మోనోగ్రామ్ డెనిమ్ మినీ స్కర్ట్, మై ఎల్వి చైన్ నెక్లెస్, అన్నీ లూయిస్ విట్టన్ (@లూయిస్‌విట్టన్) బ్రాండ్ వే..
#BAZAARINDIA #BAZAARCOVER #కవర్షూట్ #లూయిస్ విట్టన్ హ్యాష్ ట్యాగులతో ఈ ఫోటోషూట్ వీడియోని సదరు మ్యాగజైన్ వైరల్ చేస్తోంది.