ఫుల్ బ్లాక్‌లో మైండ్ బ్లాక్ చేసిన సమంత
బ్లాక్ ఫ్యాంట్ కాంబినేషన్ ఆకట్టుకోగా, ఆ ఫంకీ హెయిర్ స్టైల్ స్ట్రైకింగ్ లుక్ కట్టి పడేస్తున్నాయి.
సమంత ఇప్పుడు గ్రేట్ కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తోంది. సిటాడెల్ హనీబన్ని ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. వరుణ్ ధావన్ తో కలిసి తన రెండో వెబ్ సిరీస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అదే సమయంలో వరుస ఫోటోషూట్లతో వెబ్ మాధ్యమంలో దాడి చేస్తోంది. తాజాగా సమంత ఫుల్ బ్లాక్ డ్రెస్ లో కనిపించి మతులు చెడగొట్టింది. బ్లాక్ ఇన్నర్ లో అందాలను ఆరబోస్తూ సమంత ఇచ్చిన ఈ ఫోజ్ గుండెలు జిల్లనిపిస్తోంది. ఇక ఇన్నర్ అందాలను కవరప్ చేస్తూ ఒక బ్లాక్ కోట్ ని కూడా సమంత ధరించింది. బ్లాక్ ఫ్యాంట్ కాంబినేషన్ ఆకట్టుకోగా, ఆ ఫంకీ హెయిర్ స్టైల్ స్ట్రైకింగ్ లుక్ కట్టి పడేస్తున్నాయి.
దీనికి అందమైన క్యాప్షన్ ని కూడా ఇచ్చింది సమంత. ``డిస్నీ యువరాణిగా విఫలమైంది .. నేను ఇప్పుడు డ్రాగన్‌ని! అంటూ కన్ను గీటుతున్న ఫోటోగ్రాఫ్ ని సమంత షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో సునామీ సృష్టిస్తోంది.
ఇప్పుడిప్పుడే మయోసైటిస్ కలత నుంచి బయటపడుతున్న సమంత వరుస ఇంటర్వ్యూలలో తన సమస్య గురించి వివరాల్ని అందిస్తోంది. మయోసిటిస్ వ్యాధి నిర్ధారణ కారణంగా సినిమాలకు విరామం ఇచ్చిన అమంత రూత్ ప్రభు `సిటాడెల్` షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక సవాళ్లను తన పోడ్‌కాస్ట్ TAKE20లో ఇటీవలి ఎపిసోడ్‌లో వెల్లడించింది. సిటాడెల్ కోసం ఛాలెంజింగ్ షూట్‌లో తీవ్రమైన అలసట కారణంగా యాక్షన్ సీక్వెన్స్‌లో స్పృహతప్పి పడిపోయానని తెలిపింది. ఆ సమయంలో తన తల కుదుపునకు గురైంది. ఖుషీ పూర్తయాక సిటాడెల్ కోసం యాక్షన్ సీక్వెన్సులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా నొప్పిని బాధను భరించానని కూడా సమంత తెలిపింది.
మైయోసిటిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కండరాలపై దాడి చేస్తుంది.. ఫలితంగా వాపు, బలహీనత.. భరించలేని నొప్పి వస్తుంది. ఇది ప్రధానంగా కండరాలలో బలహీనత, కండరాలలో నొప్పి, కండరంపై దద్దుర్లు కలిగిస్తుంది.
ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2024లో మాట్లాడిన వారిలో సమంత ఒకరు. ఈ వేదికపై తాను ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో ఎలా పోరాడింది? అనే దాని గురించి మాట్లాడింది. సమంత మాట్లాడుతూ .. నా రుగ్మత గురించి నేను బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో నా లేడీ ఓరియెంటెడ్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. నేను అప్పట్లో చాలా అనారోగ్యంతో ఉన్నాను. అది కష్టంగా ఉంది.. నేను దేనికీ సిద్ధంగా లేను. రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. నిర్మాతలు నేను దానిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.. లేకపోతే అది (సినిమా) చనిపోతుంది.. అని సమంత ఆవేదన చెందింది. ప్రస్తుతం సిటాడెల్ - హనీ బన్ని విడుదల కోసం సమంత ఆసక్తిగా వేచి చూస్తోంది.