స‌మంత బ్యాక్ లెస్ ఫోజ్!

టాలీవుడ్ క్వీన్ స‌మంత ప్ర‌స్తుతం త‌న కెరీర్ ప‌రిధిని విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు-త‌మిళంలో ఇంత‌కాలం అగ్ర నాయిక‌గా హోదాను అందుకుంది

Update: 2023-11-10 02:01 GMT

టాలీవుడ్ క్వీన్ స‌మంత ప్ర‌స్తుతం త‌న కెరీర్ ప‌రిధిని విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు-త‌మిళంలో ఇంత‌కాలం అగ్ర నాయిక‌గా హోదాను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లోను స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇంత‌లోనే లైఫ్ లో కొన్ని ఒడిదుడుకుల నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేసింది. ఇప్పుడు త‌న ఫోక‌స్ అంతా కెరీర్ ఎదుగుద‌ల‌పైనే.


ఇటీవ‌ల స‌మంత విహార‌యాత్ర‌ల నుంచి వ‌రుస‌ ఫోటోషూట్ల‌ను షేర్ చేసింది. ఇప్పుడు భూటాన్ ప‌ర్య‌ట‌న‌లో డిటాక్సిఫికేష‌న్ చికిత్స‌కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తోంది. దీనికి మించి పాపుల‌ర్ హార్ప‌ర్ బ‌జార్ క‌వ‌ర్ పేజీపై స‌మంత ద‌ర్శ‌న‌మివ్వ‌డం అభిమానుల‌ను ఆక‌ర్షించింది. పాపుల‌ర్ మ్యాగ‌జైన్ కోసం స‌మంత ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇందులో ప్ర‌యోగాత్మ‌కంగా బ్లాక్ మోనోకిలో క‌నిపించింది. మ‌రోవైపు స‌మంత బ్యాక్ లెస్ ఫోజ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

సామ్ పూర్తిగా డిజైన‌ర్ బాట‌మ్ ని ధ‌రించి వీపు భాగంలో ఎటువంటి ఆచ్ఛాద‌నా లేకుండా పూర్తి ప్ర‌యోగాత్మ‌క లుక్ తో క‌ట్టి ప‌డేస్తోంది. సామ్ దుప‌ట్టా త‌ర‌హా టాప్ ని ముంద‌రి భాగంలో ధ‌రించి క‌నిపించింది. ఇక ఈ బ్యూటీ బేర్ బ్యాక్ ఫోజ్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోందంటే అతిశ‌యోక్తి కాదు. హార్ప‌ర్ బ‌జార్ క‌వ‌ర్ కోసం స‌మంత సుమారు 10ర‌కాల వైవిధ్య‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

తాజాగా హార్పర్స్ బజార్‌తో మాట్లాడుతూ ఆన్‌లైన్ ప్రతికూలత గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తన నిజమైన స్వీయ బలహీనతలు బలాలు ప్రదర్శించినందుకు ట్రోలింగుకి గుర‌య్యాన‌ని స‌మంత తెలిపింది. ''సోష‌ల్ మీడియాని మేనేజ్ చేయ‌డం అంత సులభం కాదు, కానీ నేను సోషల్ మీడియాతో నా సంబంధంలో ఒక మధురమైన స్థానాన్ని అందుకున్నాను. నా నిజమైన వ్యక్తిత్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం.. బలహీనతలు, బలాలు .. నాలో ఉన్నవన్నీ చూపించడం చాలా సంతృప్తినిస్తోంది. అయితే ఏదైనా త‌ప్పు చేస్తే నేను మరొక ట్రోలింగ్ ఫెస్ట్‌కి లక్ష్యంగా మారాను'' అని సమంత చెప్పింది.

Tags:    

Similar News