బంగారు చోళీలో సారా అందాల వ‌డ్డ‌న‌

అయితే ఈ అంద‌మైన డిజైన‌ర్ ఫ్లోర‌ల్ డ్రెస్ లో కూడా త‌న ఎద అందాల‌ను తెర నిండుగా ప‌రిచేసింది ఈ కుర్ర‌బ్యూటీ.

Update: 2023-12-04 04:06 GMT

బికినీలు.. స్విమ్ సూట్ల‌తో వేడెక్కించ‌డం న‌టవార‌సురాలు సారా అలీఖాన్ కి కొత్తేమీ కాదు. మాల్దీవుల వెకేష‌న్ నుంచి గోవా పార్టీల వ‌ర‌కూ ప్ర‌తిసారీ సారా అలీఖాన్ వేడెక్కించే పొట్టి దుస్తుల‌తో క‌నిపించింది. ఇక జిమ్ యోగా సెష‌న్స్ లో టైట్ ఫిట్ దుస్తుల్లో స్పెష‌ల్ ట్రీట్ ని ప్లాన్ చేస్తుంది ఈ బ్యూటీ. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫెస్టివ‌ల్ గురించి నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతూనే ఉంది.


అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా సారా అలీఖాన్ ఒక ట్రెడిష‌న‌ల్ లెహంగాలో క‌నిపించింది. అయితే ఈ అంద‌మైన డిజైన‌ర్ ఫ్లోర‌ల్ డ్రెస్ లో కూడా త‌న ఎద అందాల‌ను తెర నిండుగా ప‌రిచేసింది ఈ కుర్ర‌బ్యూటీ. చాలా కాలం క్రితం మాధురి ధీక్షిత్ 'చోళీకే పీచే క్యాహై' ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఆ రేంజులో సారా త‌న అంద‌చందాల‌ను చోళీలో ఆవిష్క‌రించింది. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేష‌న్ లో రూపొందించిన ఈ భారీ డిజైన‌ర్ లెహంగాకు కాంబినేష‌న్ గా గోల్డ్ క‌ల‌ర్ డిజైన‌ర్ టాప్ ని ధ‌రించింది సారా.

ఈ స్పెష‌ల్ డ్రెస్ లో కెమెరాల‌కు డ్యాషింగ్ గా ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. మ‌రోవైపు సారా విభిన్న‌మైన ఫోజులు, వైవిధ్య‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించిన ఫోటోషూట్లు కూడా ఇంట‌ర్నెట్లో సునామీలా మారాయి. యంగ్ గాళ్ సారా బాలీవుడ్ స్టార్ కిడ్స్ లో ఎప్ప‌టికీ స్ట‌న్న‌ర్ అని ప్రూవ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ సిరీస్ లో:

బాలీవుడ్ లో స్టార్ డ‌మ్ అందుకున్న ప్ర‌తిభావ‌నిగా సారా అలీఖాన్ పేరు మార్మోగుతోంది. ఈ బ్యూటీ విల‌క్ష‌ణ ఎంపిక‌లకు అభిమానులున్నారు. న‌టిగా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో సారా మెప్పించింది. ఇటీవ‌ల ప‌లు రొమాంటిక్ కామెడీల్లో న‌టించి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న సారా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఒరిజిన‌ల్ సిరీస్ కోసం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలి పాత్ర‌లోను న‌టిస్తోంది. త‌న‌ను తాను నిరూపించుకోవ‌డానికి స్కోప్ ఉన్న పాత్ర‌తో అభిమానుల ముందుకు రానుంది.

Tags:    

Similar News