న్యూడ్ సీన్ పై నటి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ నటి శరణ్య ప్రదీప్ పేరు ఇప్పుడు బాగా ఫేమస్ అవుతోన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ నటి శరణ్య ప్రదీప్ పేరు ఇప్పుడు బాగా ఫేమస్ అవుతోన్న సంగతి తెలిసిందే. `అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్` లో నటించిన అమ్మడి పాత్రకి మంచి గుర్తింపు రాడంతో? క్రేజ్ రెట్టింపు అయింది. డీసెంట్ రోల్స్ లో కనిపించే శరణ్య ఒక్కసారిగా న్యూడ్ సీన్ లో నటించేసరికి నెట్టింట ఫాలోయింగ్ పెరిగింది. అందులోనూ అలాంటి సీన్ లో ఓ తెలుగు నటి నటించడం అంటే సంచలనమే.
న్యూడ్ సన్నివేశాలంటే తెలుగు నటులు అంగీకరించరు. రకరకాల విమర్శలు తెరపైకి వస్తాయి? అన్న భయంతో చేయడానికి భయపడతారు. కానీ శరణ్య మాత్రం వాటి వేటిని పట్టించుకోకుండా ముందుకెళ్లి సక్సెస్ అయింది. తాజాగా ఆ సీన్ విషయంలో తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కుందో తెలిపింది.
కథాపరంగా వచ్చే సీన్ కావడంతో అలా నటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.
ఈ చిత్రంలో న్యూడ్‌గా నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగ లేదు. నా భర్త ప్రోత్సాహం, డైరెక్టర్ సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సీన్ కంప్లీట్ చేశా. కానీ ఈ సీన్ పై వస్తున్న విమర్శలు బాధి స్తున్నాయి. ఇంకేదో ఆశించి ఇలా న్యూడ్‌గా నటించానని చర్చించుకోవడం.. పలు వెబ్ సైట్లు దీనిపై దారుణంగా రాయడం వల్ల బాధ కలుగుతోంది. అలాంటి వారు చూసే విధానాన్ని మార్చుకోవాలి` అని అన్నారు.
అయితే ఈ తరహా పాత్రతో శరణ్యకి కొత్త అవకాశాలు తెచ్చి పెడుతున్నాయని టాక్ వినిపిస్తుంది. తెలుగు నటి అలాంటి సీన్ లో నటించడం అంటే? సినిమా పట్ల ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. డీసెంట్ పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న శరణ్యకి ఇందులో న్యూడ్ రోల్ తో కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుంది. కొత్త అవకాశాలకు ఇలాంటి సాహసాలు సైతం అంతే అవసరం.