శాటిలైట్..ఓటీటీ అంతా షోనా?
అలాగే శాటిలైట్ రూపంలో భారీగా డిమాండ్ పలికిందంట అని మీడియాలో కథనాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
థియేట్రికల్ రిలీజ్ కంటే? ఓటీటీ రిలీజ్ ఉత్తమం అని భావించే దర్శక-నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కంటెంట్ ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. నిర్మాతలు సైతం ఓటీటీలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక పాన్ ఇండియా వైడ్ ఓటీటీ బిజినెస్ పీక్స్ లో జరుగు తుందని ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. ఆ సినిమా అన్ని కోట్లు చేసిందంటా? ఫలానా సినిమా రైట్స్ కోసం ఓటీటీ కంపెనీలు పోటీ పడిమరీ కొన్నాయంట? వంటి మాటలు తరుచూ వింటునే ఉంటాం.
అలాగే శాటిలైట్ రూపంలో భారీగా డిమాండ్ పలికిందంట అని మీడియాలో కథనాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అగ్ర హీరోలు సినిమాలు బిజినిసెస్ వ్యవహారం పీక్స్ లో వ్యాపారం కనిపిస్తుంటుంది. మరి ఈ బిజినెస్ లెక్కలు ఎంతవరకూ వాస్తవం? నిజంగా అంత బిజినెస్ జరుగుతుం దా? లేదా? ఇదంగా రిలీజ్ కి ముందు తీసుకొచ్చే హైపా? అంటే నిర్మాత స్రవంతి రవికిషోర్ మాటల్ని బట్టి ప్రచారం లాగానే కనిపిస్తుంది.
తాజాగా ఆయన ఓటీటీలో సినిమా బిజినెస్ ఎలా జరుగుతుందో వివరించే ప్రయత్నం చేసారు. ఇప్పుడు శాటిలైట్..ఓటీటీ నుంచి ఎక్కువగా డబ్బులు రావడం లేదన్నారు. కేవలం థియేటర్ నుంచి వచ్చే వసూళ్లే కీలకంగా మారుతున్నాయన్నారు. ఏ స్థాయి సినిమాకైనా కథ..బావోద్వేగాలు కీలకం. మనసులకు హత్తుకు నేలా పండాయంటే ఇది అవార్డు సినిమానా? కమర్శియల్ సినిమానా? అనే పట్టింపు ఉండదు. అలాంటి సినిమాలు ఎలాంటి వేదికలపై విడుదలైన మంచి ఫలితాలు సాధిస్తాయి. అయితే ఓటీటీ కంటే థియేటర్ రిలీజ్ ఉత్తమం అన్నారు.
`నేను అన్ని సినిమాల విషయంలో సంతృప్తిగానే ఉన్నాను. ఆర్దికంగా అన్ని ఒకే రకమైన ఫలితాలు ఇవ్వలేదు గానీ చేసిన సినిమాలన్నింటి విషయంలో గర్వపడుతున్నా. ఇది ఎందుకు చేసానని బాధపడిన సినిమా ఒక్కటీ లేదు. ఆ తృప్తితోనే నా సినిమా ప్రయాణం సాగుతుంది. వేగంగా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా అదే. కథ విషయంలో అంతా పక్కాగా అనుకుంటనే ముందుకెళ్తా అని అన్నారు.