కమ్ముల కూడా.. త్రివిక్రమ్, సుక్కు రూట్లోనే..

ఆయన మరెవరో కాదు క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ముల సినిమాలు 'ఏషియన్ సినిమాస్' నిర్మాణ సంస్థలోనే ఉంటున్నాయి.

Update: 2024-02-01 03:00 GMT
కమ్ముల కూడా.. త్రివిక్రమ్, సుక్కు రూట్లోనే..
  • whatsapp icon

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ ఎక్కువగా పెద్ద నిర్మాణ సంస్థతోనే సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక అగ్ర నిర్మాణ సంస్థలు సైతం స్టార్ కాంబినేషన్ కే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే కొంతమంది అగ్ర దర్శకులు మాత్రం పనిచేసిన నిర్మాణ సంస్థతోనే పదేపదే సినిమాలు చేస్తుంటారు. అందులో ఇప్పటికే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ముందు వరుసలో ఉండగా తాజాగా ఈ లిస్ట్ లో మరో డైరెక్టర్ కూడా చేరిపోయారు.

ఆయన మరెవరో కాదు క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ముల సినిమాలు 'ఏషియన్ సినిమాస్' నిర్మాణ సంస్థలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో ఏషియన్ సినిమాస్ కూడా ఒకటి. సునీల్ నారంగ్ ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏషియన్ సినిమాస్ తో శేఖర్ కమ్ముల మొదటగా 'లవ్ స్టోరీ' సినిమాని తెరకెక్కించారు.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక లవ్ స్టోరీ సక్సెస్ తరువాత మరోసారి ఏషియన్ సినిమాతో కలిసి ధనుష్, నాగార్జున లతో ఓ మల్టీ స్టారర్ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఇక ఇప్పుడు అదే ఏషియన్ సినిమాస్ లో శేఖర్ కమ్ముల మూడో సినిమా కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ తో లీనమైనట్లు.. త్రివిక్రమ్ హారిక హాసినితో ఉన్నట్లు.. ఇప్పుడు శేఖర్ కమ్ముల ఏషియన్ సినిమాస్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ధనుష్, నాగర్జునల మల్టీ స్టారర్ కనుక సక్సెస్ అయితే ఏషియన్ సినిమాస్ శేఖర్ కమ్ముల హోం బ్యానర్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక శేఖర్ కమ్ముల - ధనుష్ - నాగార్జున ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ముంబై నేపథ్యంలో మాఫియా బ్యాగ్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతుందట. ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ముంబై లోని స్లమ్ ఏరియా 'ధారావి' నే సినిమా టైటిల్ గా పెట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ మొత్తం ముంబై మురికివాడలో నడుస్తుందట. అందుకే ఈ సినిమాకు టైటిల్ గా 'ధారావి' ని ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున డాన్ గా కనిపించనున్నాడు.

Tags:    

Similar News