20 ఏళ్ల గాయని 14వయసు నటుడితో డేటింగ్!
పాపులర్ గాయని కం నిర్మాత .. ప్రముఖ స్టార్ హీరో పుత్ర రత్నంతో ప్రేమలో ఉందని ప్రచారం సాగుతోంది
పాపులర్ గాయని కం నిర్మాత .. ప్రముఖ స్టార్ హీరో పుత్ర రత్నంతో ప్రేమలో ఉందని ప్రచారం సాగుతోంది. అతడు తన కంటే ఆరేళ్లు చిన్నవాడైనా కానీ తన సాన్నిహిత్యాన్ని కోరుకుంటోంది. అయితే ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? అప్పటికే పాప్ స్టార్ తో ప్రేమలో ఉన్న సదరు గాయని ఉన్నట్టుండి యువనటుడితో ప్రేమలో పడిందా? అంటూ ఆరాలు కొనసాగుతున్నాయి. ఇంతకీ ఎవరీ ప్రేమ జంట అంటే.. వివరాల్లోకి వెళ్లాలి. ఇదంతా ఓ ముగ్గురు పాపులర్ సెలబ్రిటీల మధ్య మూడు ముక్కలాట. ముక్కలాటలో ఆ ముగ్గురూ ఎవరు? అంటే... సెలీనా గోమెజ్- జాడెన్ స్మిత్ (విల్ స్మిత్ కొడుకు)- జస్టిన్ బీబీర్.
జస్టిన్ - సెలీనా మంచి స్నేహితులు. కానీ జస్టిన్ కి దూరమైన సెలీనా (20) తనకంటే ఆరేళ్ల చిన్నవాడైన జాడెన్ స్మిత్ (14)తో డేటింగ్ చేస్తోందంటూ కొన్నేళ్ల క్రితం ప్రచారం సాగింది. జస్టిన్ బీబర్ నుంచి విడిపోయిన తర్వాత సెలీనా గోమెజ్ జాడెన్ స్మిత్ కి క్లోజ్ అయ్యారనే పుకార్ ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్యా ఇటీవల బ్రేకప్ అయ్యిందంటూ మరో కథనం వేడెక్కిస్తోంది. సెలీనా, బీబర్ బ్రేకప్ తర్వాత ఎవరికి వారు ఇతర సంబంధాల్లో సంతోషంగా ఉన్నారు. కానీ ఆ ఇద్దరి గతం గురించి వారి స్నేహం గురించి కథనాలు రిపీటెడ్ గా వచ్చాయి. అభిమానులు సోషల్ మీడియా ఆర్కైవ్లను పరిశీలించి దీనిని గమనించారు. 2013లో అప్పటికి 20 ఏళ్ల వయసున్న సెలీనా గోమెజ్, 14 వయసున్న జాడెన్ స్మిత్‌తో కలిసి రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లడం కనిపించింది. ఇద్దరూ తాము స్నేహితులుగా ఉన్నామని చెప్పినా కానీ... 14 ఏళ్ల జాడెన్ సెలీనాతో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వైరల్ అయ్యాయి.
సెలీనా గోమెజ్ (ఇప్పటి వయసు 31) - జస్టిన్ బీబర్ 2018లో విడిపోయే వరకు చాలా సంవత్సరాల పాటు ఆన్ అండ్ ఆఫ్‌లో ఉన్నారు. అయినప్పటికీ కొన్నేళ్ల పాటు ఇద్దరూ చాలా మంది సుపరిచిత స్నేహితులతోను కనిపించారు. జాడెన్ స్మిత్ (ఇప్పటికి 25) - సెలీనా గోమెజ్ ద్వయం అందరికీ సుపరిచితమైన స్నేహితులు కూడా. జాడెన్ స్మిత్ నటించిన ది కరాటే కిడ్ చిత్రం కోసం నెవర్ సే నెవర్ అనే పాటలో జాడెన్ - జస్టిన్ కలిసి పనిచేశారు. ఇద్దరూ చాలాసార్లు కలిసి పని చేసారు. వారి స్నేహం బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు 14 ఏళ్ల వయసులో ఉన్న జాడెన్, కైలీ జెన్నర్‌తో డేటింగ్ చేస్తున్నాడని కూడా పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత జస్టిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఇది హాలీవుడ్లో డేటింగ్ పుకార్ల సీక్వెన్స్. దీనిని లవ్ ట్రయాంగిల్ గా వర్ణించలేము.
అయితే ఇలాంటి ఊహాగానాలను మనమంతా నమ్మాల్సిన పని లేదు. కానీ దీనికి ప్రూఫ్ ఉంది. పదే పదే బ్రేకప్‌లు.. ప్యాచ్-అప్ల నడుమ ఎక్కడో 2013లో స్మిత్‌తో విందులో సెలీనా కనిపించిన తర్వాత ఇద్దరూ సీరియస్ గా డేటింగ్ చేస్తున్నారని అంతా భావించారు. ఇది ఇంటర్నెట్లో వైరల్ గా పబ్లిసిటీ తెచ్చుకుంది.కొన్ని వీడియోలు వైరల్ అయిన తర్వాత సెలీనా మనసు మారిందని, జాడెన్ స్మిత్ బెస్ట్ ఫ్రెండ్ జస్టిన్ను సెలీనా తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని కూడా ఊహించడం ప్రారంభించారు. చాలా మంది అభిమానులు ఇద్దరి మధ్య భారీ వయస్సు అంతరాన్ని కూడా ఎత్తి చూపారు. ఇదంతా చాలా గందరగోళంగా ఉందని అయితే తను స్నేహం చేసిన లేదా కనిపించిన ప్రతి వ్యక్తితో సెలీనాను లింక్ చేసి రాయడం సరికాదని కొందరు ఖండించారు. సెలీనా గోమెజ్ -జాడెన్ స్మిత్ ల నమ్మకమైన అభిమానులు ఇవన్నీపుకార్లు అని ఖండించారు. ఆ ఇద్దరూ నగరంలో ఉన్నప్పుడు ఇది కేవలం స్నేహపూర్వక విందు అని క్లారిటీనిచ్చారు.
నేటికి వారి పరిస్థితి ఇలా ఉంది. జస్టిన్ -హేలీ బీబర్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. సెలీనా గోమెజ్ బెన్నీ బ్లాంకోతో పిచ్చిగా ప్రేమలో ఉన్నారు. జాడెన్ - జస్టిన్ ఇప్పటికీ స్నేహితులు. కాబట్టి కొన్నిసార్లు ఎటువంటి నిప్పులేకుండానే పొగ పుడుతుందని భావించాలి.