ఆ హీరో ఇమేజ్ నాకవసరం లేదు!
కెరీర్ ప్రారంభం నుంచి షారుక్ ఖాన్ లా రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నారు? ఆయనలా ఎదగాలి అనుకుంటున్నారా? అంటే షాక్ అయ్యే సమాధానం ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్...షారుక్ ఖాన్..అమీర్ ఖాన్..హృతిక్ రోషన్ తరం స్టార్లకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తమ స్టార్ డమ్ తోనే కోట్ల రూపాయలు వసూల్ చేసే సత్తా ఉన్న హీరోలు. ఆ తర్వాత తరం నటులు బాలీవుడ్ కి రావడానికి ఈ నలుగురు ఎంతో స్పూర్తి అనొచ్చు. ముఖ్యంగా షారుక్ ఖాన్ చాలా మంది నటుల కు ఆదర్శం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడాయన.
నీ ముఖానికి సినిమాలా? అని ఎన్నో అవమానాలు ఎదుర్కుని మరీ పెద్ద స్టార్ అయ్యాడు షారుక్. అందుకే షారుక్ ఎన్ని తరాలకైనా స్పూర్తి అనొచ్చు. అతడిలాంటి ఇమేజ్ కోసం ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ షాహిద్ కపూర్ మాత్రం షారుక్ పేరెత్తితో అదొక మచ్చలా భావిస్తున్నట్లు కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి షారుక్ ఖాన్ లా రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నారు? ఆయనలా ఎదగాలి అనుకుంటున్నారా? అంటే షాక్ అయ్యే సమాధానం ఇచ్చాడు.
'ఐస్ క్రీమ్ తయారు చేసేవాళ్లు మనకు నచ్చింది కదా అని ఎప్పుడు వెన్నెలా ఇవ్వరు. అది లేనప్పుడు మరో ప్లేవర్ తీసుకో అంటారు. అన్నీ ప్లేవర్ లు రుచి చూడండి అంటారు. అలాగే మనం ఒకరిని అభిమానించినంత మాత్రాన అలాగే ఉండాలి అని అనుకోం. మరొకరి వెలుగులో మనమెందుకు ఉండాలి? మనకు మనమే సూర్యుడిలో ఎందుకు వెలుగు చూపించకూడదు. ప్రతీ నటుడికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది.
వారిని ఇతర స్టార్లతో పొల్చి చూడటం అన్నది తప్పు. అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు' అని అన్నారు. షాహిద్ వ్యాఖ్యల్ని బట్టి ఆయనకు ఇతరుల్ని అనుకరించడం ఇష్టం ఉండదని తెలుస్తోంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తో తానే ఓ బ్రాండ్ అవ్వాలి తప్ప! వారి వెలుగు తో ఎన్నాళ్లు నెట్టుకొస్తాం? అన్న వాదన కనిపిస్తుంది.