డిస్ట్రిబ్యూటర్లతో హీరో మీటింగ్...మ్యాటర్ చాలా ఉందే!
'సలార్'..'డంకీ' ఒక్క రోజు గ్యాప్ లో ఇదే నెలలో ( డిసెంబర్ 21..22 తేదీల్లో) రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే
'సలార్'..'డంకీ' ఒక్క రోజు గ్యాప్ లో ఇదే నెలలో ( డిసెంబర్ 21..22 తేదీల్లో) రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తొలిసారి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్...షారుక్ ఖాన్ తలపడుతున్నారు. విజయం పై ఎవరి ధీమా వారికుంది. పఠాన్..జవాన్ విజయాలతో పుల్ స్వింగ్ లో ఉన్న షారుక్ డంకీతో హిట్ అందుకుని హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తున్నాడు. ఇక డార్లింగ్ సాహా...ఆదిపురుష్ తో ఎదురైన పరాభవాలన్నింటకి సలార్ సమాధానం చెబుతుందని..అన్ని లెక్కలు సలార్ బ్యాలెన్స్ చేస్తుందని ఎంతో ధీమాగా ఉన్నాడు.
మరి ఎవరి సత్తా ఎంత అన్నది తేలడానికి మరో వారం రోజులు సమయం ఉంది. ఇక రిలీజ్ పరంగా ఎవరి సొంత రాష్ట్రాల్లో వారికి ఎలాగూ క్రేజ్ ఉంటుంది. స్థానిక బలం అక్కడ ఎలాగూ పనిచేస్తుంది. ఆ విషయంలో డార్లింగ్ ఖాన్ సాబ్ కంటే ముందులోనే కనిపిస్తున్నాడు. షారుక్ కి తెలుగు లో పెద్ద మార్కెట్ లేదు .కానీ ప్రభాస్ కి హిందీలోనూ మంచి మార్కెట్ ఉంది. అలాగే ఇతర భాషల్లో ఇద్దరు నటుల్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.
అయితే తాజాగా షారుక్ ఖాన్ని నిన్నటి రోజు డంకీ పంపిణీదారులతో సమావేశమయ్యారుట. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ తరుపున సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలక విషయాలు షేర్ చేసుకున్నట్లు వినిపిస్తోంది. డిస్కషన్ నైట్ డిన్నర్ పార్టీ వరకూ సాగిందని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్.. ట్రెండ్స్, పబ్లిక్ టాక్ ఎలా ఉంది అన్న అంశాలపై ప్రధానంగా చర్చించారుట.
అలాగే థియేటర్ల సర్దుబాటు ఎలా జరిగింది. ఏ ప్రాంతంలో ఎవరు హైలో ఉన్నారు. లో ఉన్నారు? వంటి విషయాలు చర్చించినట్లు తెలిసింది. ఎక్కడా ఎలాంటి తప్పు దొర్లకుండా రిలీజ్ వరకూ జాగ్రత్తగా చూసు కోవాలని సూచించారుట. రిలీజ్ తర్వాత న్యాయ నిర్ణేతలు ప్రేక్షకులే కాబట్టి అక్కడ నుంచి ఏ హీరో చేసేదేం ఉండదు. అన్ని వాటంతటవే జరిగిపోతుంటాయి. తొలి షోతో ఏ సినిమాలో మ్యాటర్ ఉందో తెలిపోంది. ఆ తర్వాత థియేటర్ల సంఖ్య పెరగడం అన్నది సహజంగా చోటు చేసుకుంటుంది. ఇలా అన్ని విషయాలపై షారుక్ కూలంకుశంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.