షారూఖ్‌- య‌ష్ కాంబో బిగ్ స్కెచ్?

ఇంత‌లోనే నేరుగా హిందీ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు చర్చలు జరుపుతున్నాడు. రామాయ‌ణం త‌ర్వాత అది మ‌రింత క్రేజీ ప్రాజెక్ట్ కానుంది.

Update: 2024-01-30 15:06 GMT
షారూఖ్‌- య‌ష్ కాంబో బిగ్ స్కెచ్?
  • whatsapp icon

కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాల‌తో పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటాడు క‌న్న‌డ‌ రాకింగ్ స్టార్ య‌ష్‌. అప్ప‌టివ‌ర‌కూ య‌ష్ వేరు.. ఆ త‌ర్వాత య‌ష్ వేరు. ఇప్పుడు హిందీ బెల్ట్ లో ప్ర‌భాస్ త‌ర‌హాలోనే భారీ ఫాలోయింగ్ ఉన్న సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ అత‌డు. అందుకే ఇక‌పై అత‌డు న‌టించే ప్ర‌తి ప్రాజెక్ట్ విష‌యంలో చాలా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాడు. కేజీఎఫ్ 2 త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డు న‌టించిన మ‌రో సినిమా రానే లేదు అంటే స‌న్నివేశాన్ని అర్థం చేసుకోవాలి.

అలాగే నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణం'తో యష్ బాలీవుడ్‌లో పెద్ద పొజిష‌న్ పై క‌న్నేశాడు. ఇంత‌లోనే నేరుగా హిందీ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు చర్చలు జరుపుతున్నాడు. రామాయ‌ణం త‌ర్వాత అది మ‌రింత క్రేజీ ప్రాజెక్ట్ కానుంది. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి య‌ష్ తన ఆసక్తిని తెలియజేసాడు. KGF ఫ్రాంచైజీ విజయంతో గొప్ప‌ ప్రశంసలు పొందిన యష్... నితీష్ తివారీ రూపొందిస్తున్న పౌరాణిక‌ డ్రామా 'రామాయ‌ణం'లో రావణుడి పాత్రతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయబోతున్నాడు. షారూఖ్ తో అందుకు భిన్న‌మైన సినిమాని చేయాల‌నేది ప్లాన్.

కేజీఎఫ్ కి రామాయణంకి మ‌ధ్య‌లో యష్ తన తదుపరి సినిమాల విష‌య‌మై తెలివిగా ప్లాన్స్ వేస్తున్నాడు. షారూఖ్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అతడి రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ భారీ యాక్షన్ చిత్రం కానుండ‌డం అత‌డికి బాగా క‌లిసొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతానికి చర్చలతో ఆలోచనలను షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం యష్ చాలా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ ఆలోచన ఇద్దరు పెద్ద స్టార్ల‌ను ఎగ్జ‌యిట్ చేస్తోంది. అయితే వారు సరైన స్క్రిప్టు విష‌య‌మై చాలా జాగ్రత్తగా ఉన్నారు. అభిమానుల్లో ఉన్న భారీ అంచనాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్ట్ ఛాలెంజింగ్ గా ఉండాలని భావిస్తున్నార‌ట‌. హడావుడిగా నిర్ణయం తీసుకోవడం కంటే సావ‌ధానంగా ఆలోచించి ముందుకు సాగ‌నున్నార‌ని తెలిసింది.

అయితే యష్ వైపు నుంచి దీనిపై ఎలాంటి అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. ప్రస్తుతం అతడు ఇప్ప‌టికే కమిట్ అయిన ప్రాజెక్ట్‌లపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడ‌ని, ఇత‌ర విష‌యాలేవి ఉన్నా తెలియ‌జేస్తామ‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. రణబీర్ కపూర్ - తివారీ కాంబినేష‌న్ మూవీ 'రామాయణం' కోసం యష్ 150 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తారని క‌థ‌నాలొచ్చాయి. సాయి పల్లవిని సీత పాత్ర కోసం ఎంపిక చేయ‌గా, హ‌నుమంతుడిగా స‌న్నీడియోల్ క‌న్ఫామ్ అయ్యాడు. బాబిడియోల్ కుంభ‌క‌ర్ణుడిగా న‌టిస్తాడు. త‌మిళ‌న‌టుడు విజ‌య్ సేతుప‌తిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసార‌ని తెలుస్తోంది.


Tags:    

Similar News