ఒక్కడు, పోకిరి.. అలాంటి పిక్చరే గేమ్ ఛేంజర్: శంకర్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Update: 2025-01-02 13:48 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా.. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. జనవరి 10వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్లలో సందడి చేయనుంది.

ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, నాలుగు సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వనున్న వేళ.. మేకర్స్.. నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పాలిటిక్స్ లో రామ్ చరణ్ పవర్ ఫుల్ గేమే సినిమాగా తెలుస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. అంచనాలు పెరిగాయని అంటున్నారు.

అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఒక్కడు, పోకిరి సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. తాను కూడా ఒకరోజు అలాంటి సినిమా చేయాలనుకున్నానని, గేమ్ ఛేంజర్ అలాంటి పిక్చరేనని అన్నారు. దీంట్లో ఎలిమెంట్స్, అన్ని క్రియేటివ్ థింగ్స్ యాడ్ చేసినట్లు పేర్కొన్నారు.

"ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక పొలిటీషియన్ మధ్య జరిగిన వార్ గేమ్ ఛేంజర్. సినిమాలో హీరోకు బ్యాక్ స్టోరీ ఉంటుంది. మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమాపై. ఆఫీసర్ క్యారెక్టర్ లో చరణ్ బాగా చేశారు. అందుకే ఇది సంక్రాంతి కాదు.. రామ నవమి.. బాగా కోపరేట్ చేశారు అన్ని విషయాల్లో.. ఆఫీసర్ గా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. ఆయనను చూడడానికి సినిమాకు వస్తారు" అని అంచనాలు పెంచారు.

"సినిమాకు సోల్ గా ఉన్న పంచెకట్టు రోల్ లో బాగా నటించారు. కియారా బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. డ్యాన్స్ తో చరణ్ తో కియారా పోటీ పడ్డారు. అంజలి.. ఒక్కో షాట్ కు లైఫ్ ఇచ్చారు. ఇంకో సర్ప్రైజ్ ఉంది. నేరుగా సినిమాలో చూడండి. ఎస్ జే సూర్య ది బెస్ట్ ఇచ్చారు. ఆయన కన్నా ఎవరూ బాగు చేయలేరు. శ్రీకాంత్ మేకప్ కు చాలా టైమ్ పట్టేది. కానీ బాగా చేశారు" అని శంకర్ కొనియాడారు.

"సునీల్ ది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. చాలా కొత్తగా ఉంటుంది. రాజీవ్ కనకాల బాగా నటించారు. జయరాం, ఎస్ జే సూర్య కాంబినేషన్ లో కామెడీ బాగుంటుంది. అంతా కలిసి సినిమాను బలంగా మార్చారు. దిల్ రాజు గారు అయితే.. ఏ విషయంలో కూడా రాజీపడలేదు. అన్నింటికీ ఓకే చెప్పారు. అందుకే ధన్యవాదాలు. డబ్బులే కాదు.. అన్ని విషయాలు ఆయన పరిశీలిస్తారు" అని శంకర్ చెప్పారు.

"మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి అవుట్ పుట్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అన్నింట్లో ఆయన సూపర్. సాంగ్స్ అన్నీ ఓ ట్రీట్. డిఫరెంట్ గా షాట్స్ ట్రై చేశాం. తెలుగు పిక్చర్ అంటే పక్కా తెలుగు మూవీలా ఉండాలని కోరుకున్నాను. అందుకు అంతా కష్టపడి వర్క్ చేశారు. క్యాస్టింగ్ అండ్ క్రూ అంతా తమ బెస్ట్ అందించారు" అని శంకర్ తెలిపారు

Tags:    

Similar News