ఐదుగురు సమక్షంలోనే ఆ న్యూ*డ్ సీన్!

అయితే శ‌ర‌ణ్య ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌డం స్ట‌న్నింగ్ అనే చెప్పాలి. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి అటెంప్ట్ లు ఏ సినిమాలోనూ చేయ‌లేదు.

Update: 2024-02-06 16:30 GMT

తెలుగు న‌టి శ‌ర‌ణ్య ప్ర‌దీప్ సుప‌రిచిత‌మే. 'ఫిదా' తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు అటుపై చాలా చిత్రాల్లో న‌టించింది. ఆమె పోషించిన పాత్ర‌ల‌న్నీ ఎంతో డీసెంట్ గా ఉంటాయి. ప‌ద్ద‌తైన పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా న‌టించింది. శ‌ర‌ణ్య అంటే డీసెంట్ పాత్ర‌ల‌కు కేర‌ఫ్ అడ్ర‌స్ గా చెబుతారంతా. యాంక‌ర్ నుంచి న‌టిగా ట‌ర్న్ అవ్వ‌డంతోనే పాత్ర‌ల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉంటుంది అనే ఇమేజ్ ఉంది. కానీ ఇదంతా మొన్న‌టివ‌ర‌కూ ఉన్న మాట‌. 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో ఆ ట్యాగ్ ని తీసి పక్క‌న‌పెట్టాల్సిందే.


ఈ సినిమాలో హీరో అక్క పాత్ర ని శ‌ర‌ణ్య పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నా ఎక్కువ మార్కులు శ‌ర‌ణ్య పాత్రకే ప‌డ‌టం విశేషం. ఆ పాత్ర అంత బ‌లంగా ఉండ‌టంతోనే అది సాధ్య‌మైంది. సినిమా చూసిన వారంతా ఆమె క్యారెక్ట‌ర్‌నే మెచ్చుకుంటున్నారంటే ఆ పాత్ర ఇంఫాక్ట్ సినిమాలో ఎంత‌గా ఉందో అర్ధ‌మ‌వుతుంది. ప‌ద్మ‌ పొలీస్ స్టేష‌న్‌లో విల‌న్‌ను కాలితో త‌న్నే స‌న్నివేశానికి థియేట‌ర్ అంతా విజిల్స్ వేశారంటే ప్రేక్ష‌కులు ఎంత‌గా లీన‌మ‌య్యారో తెలుస్తుంది.

అదేవిధంగా స్కూల్‌లో ప‌ద్మ‌(శ‌ర‌ణ్య‌)ను విల‌న్ వివ‌స్త్రను చేసే సీన్ కూడా చాలా ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయింది. అయితే శ‌ర‌ణ్య ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌డం స్ట‌న్నింగ్ అనే చెప్పాలి. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి అటెంప్ట్ లు ఏ సినిమాలోనూ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆ స‌న్నివేశం గురించి ఆమె ఎక్స్ పీరియ‌న్స్ ని షేర్ చేసుకుంది. 'ఆ స‌న్నివేశం చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేసాను. ముఖ్యంగా నా భ‌ర్త ప్రోత్సాహం వల్లే ఆ స‌న్నివేశం చేయ‌గ‌లిగాను. నువ్వు చేయ్ ఫ‌ర్లేదు. నువ్వు చేయ‌గ‌ల‌వ‌ని.

ఇది చాలా స్ట్రాంగ్ క్యారెక్ట‌ర‌ని భ‌రోసా క‌ల్పించ‌డంతోనే చేసాను. ఆ పాత్ర అంత ఎమెష‌న‌ల్ గా క‌నెక్ట్ అయిందంటే? కార‌ణం నేను ఒక్క‌దాన్నే కాదు. అందులో నా భ‌ర్త ప్ర‌మేయం కూడా ఉంద‌ని చెబుతా. ఆ సీన్ కేవ‌లం ఐదుగురు స‌భ్యుల స‌మ‌క్షంలోనే షూట్ చేయ‌డం జ‌రిగింది. డీవోపీ భేగ్‌.. కాస్టూమ్ డిజైనర్ అఖిల‌.. డైరెక్ట‌ర్ దుశ్యంత్‌.. విల‌న్ నితిన్ ప్ర‌స‌న్న‌.. అసోసియేట్ ప్ర‌వీణ్ మాత్ర‌మే అప్పుడు ఉన్నారు. వారెంతా బాగా స‌హ‌క‌రించ‌డంతో చేయ‌గ‌లిగాను. లేక‌పోతే చాలా ఇబ్బంది ప‌డేదాన్ని' అని తెలిపింది.



Tags:    

Similar News